News

My Response to Internet Slander

Ladies and gentlemen, A couple of guys, may be even the same person with different aliases, have been spamming facebook with slander about me, the Tharanga team and Tharanga. I first ignored it as childish. The relentless campaign continued all through the night and probably will continue for some time. It is not my style […]


బడ్జెట్ పై ముందుగానే ఆసక్తి ?

మరోసారి బడ్జెట్ రాబోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ పూర్వసంప్రదింపులే జరుగుతున్నప్పటికీ, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి నుంచే సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడుతోంది. నిజానికి  ఉగాది నాడు పంచాంగ శ్రవణంలా మారిపోయింది పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం.అయినప్పటికీ ఎప్పటికప్పుడు రాబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు. ప్రస్తుతానికి మనదేశం గడ్డు సవాళ్లనే ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతృప్తికరమైన బడ్జెట్ ను అందించడం ఆర్థికమంత్రికి కష్టమే. ప్రస్తుత పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాబోయే […]


పిల్లలపాలిటి శత్రువు హైదరాబాద్ ?

మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరా… ఏమో…కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది అభాగ్యనగరమేమో అనిపిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… రెండువేల ఎనిమిది నుంచి హైదరాబాద్ లోనే ఆరువేల మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇలా అదృశ్యమైనవారిలో కేవలం రెండువేలనూటతొమ్మిది మంది మాత్రమే తిరిగి ఇళ్లకు చేరారు. ఇలా మిస్సవుతున్న వారిలో ఎక్కువ మంది 12 నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉన్న బాలికలే కావడం ఆందోళన కలిగించే విషయం. రెండువేల ఎనిమిది , పదకొండు మధ్యలో తొమ్మిది […]



కిషన్ యాత్రతో బీజేపీకి మంచి రోజులు ?

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఎందుకు చప్పబడిపోయింది. ఏకారణాలవల్ల తెలంగాణ సాధన పోరు చల్లారిపోయింది ? ఈ ప్రశ్నే తరచూ వినబడుతోంది. సరిగా ఈ పరిణామాన్నే తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది భారతీయ జనతాపార్టీ. అందుకే బీజేపీ తెలంగాణ పోరుయాత్ర మొదలుపెట్టింది. తెలంగాణ సాధన భారతీయ జనాతాపార్టీకే సాధ్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. ఇంతకీ బీజేపీ పోరు యాత్ర ఎలా సాగుతుందో తెలుసుకుందాం… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ […]


స్పీకర్ ఏంచేయబోతున్నారు?

శాసన సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే తరచూ దాని గురించి వార్తలు వస్తుంటాయి. అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్నటి శీతాకాల సమావేశాలు ముగిసినా అసెంబ్లీ చుట్టూనే వార్తలు తిరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కీలకమైన రాజకీయ పరిణామాలకు అసెంబ్లీ కేంద్ర బిందువు అవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ప్రస్తావిస్తాను. మన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని కీలక అంశాలన్నింటినీ ఏకకాలంలో ఉపయోగించుకుంటున్నది ఎక్కడో తెలుసా.. మన రాష్ట్రంలోనే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కిందనే పార్టీ […]


కొత్తా మంత్రులండీ…

కష్టకాలంలో ఆదుకున్నవారిని గుర్తించుకోవడం, ప్రతిగా వారి ప్రయోజనాలను చూడటం ఆనవాయితీ. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం, శాసనసభలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాసతీర్మానం పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సొంతగూటిలోనే వ్యతిరేకత. జగన్ వర్గీయులు ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం లేదని బల్లగుద్ది చెప్పేశారు. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం గట్టెక్కడంలో ప్రజారాజ్యం పార్టీ అండగా నిల్చింది. ఈ సందర్బంగానే కాంగ్రెస్ పెద్దలు, చిరంజీవికి కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని […]



నాట్ బిఫోర్ అంటే ఏమిటి?

లీగల్‌ సిండికేట్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదమా?  పిటీషన్ ను ఉపసంహరించుకున్న విజయమ్మ ప్రజాస్వామ్యం  ప్రమాదంలో పడిపోతోందా? చంద్రబాబు ఆస్తుల కేసును వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న వై.ఎస్.విజయమ్మ పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రింకోర్టు సూచించింది. దీనివల్ల కోర్టుల ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రిం వ్యాఖ్యానించింది.అయితే అదే సమయంలో చంద్రబాబు కేసును నాట్ బిఫోర్ పేరుతో ఎనిమిది బెంచ్ లు మార్చడంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కధనాలు వస్తున్నాయి. ఇలా బెంచ్ లు మార్చడం సరికాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఇతర […]


తెలంగాణ జ`గన్’

  అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కుంటున్న కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారనీ, అక్రమాల పుట్ట కదలిపోతుందనీ, ఆయనఅరెస్ట్ అవడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనేకాకుండా ప్రజల్లో కూడా వదంతులు వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో జగన్ ఏం చేయబోతున్నారు ?  భయపడిపోతున్నారా…? లేక ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ధైర్యంగా ఎదుర్కుని తనను తాను రక్షించుకుంటూనే తన పార్టీని సైతం బలోపేతం చేయబోతున్నారా…? అసలు ఆయన ఏ ధైర్యం చూసుకుని అంత గుండెనిబ్బరంగా ఉండగలుగుతున్నారు? […]


నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?  బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?  ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? 2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు […]


Tharanga Media Launched

web: http://tharangamedia.com; Facebook: https://www.facebook.com/tharangamedia With a simple ceremony, we formally launched Tharanga Media on January 14th, 2012 at our new operating office on Rd No. 10 Banjara Hills. The event was attended by about 70 friends and family members of Tharanga team and listeners of Mohana Muralee GaanaLahari. The subtext: listeners to us are also […]


కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుది మొదటి నుంచీ విచిత్రమైన స్టైలే. ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రకటనలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి తెలంగాణ ఏర్పాటుపై తనకు అత్యంత రహస్యమైన సమాచారం అందిందని ఒకసారి, సోనియా ఏమనుకుంటున్నారో తనకు తెలిసిపోయిందని మరోసారి సంచలనాత్మక రీతిలో ప్రకటనలు గుప్పించారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం చప్పబడినప్పుడల్లా మాటల తూటాలు పేల్చి అగ్గి రగలచ్చడంలో కూడా కేసీఆర్ కు సాటి మరెవరూ రారు. అలాగే, ఉన్నట్టుండి […]


బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలు కూల్చగలదా?

ఓట్లు రాగానే అటకెక్కించిన పథకాలు  ఏటుచూసినా ఎదిగీఎదగని బాల్యం  సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు  ప్రధాని నోటనే చేదునిజాలు  గడ్డుకాలాన్ని సూచిస్తున్న సర్వే        బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలను కూలుస్తుందా? ఈమాట వినగానే మీరు ఉలిక్కిపడవచ్చు. అసందర్భంగా ఉన్నదంటూ కొట్టిపారేయవచ్చు. కానీ, పూర్తిగా చదివితే వాస్తవాలు మీకే అర్థమవుతాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. ఏ సంక్షేమ పథకాలను చూపిస్తూ ఓట్లు దండుకుంటున్నారో, అవి పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. […]


ఆసియాలోనే మన బ్యూరోక్రసీ అధ్వాన్నం

అధికారగణంలో అలసత్వం ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వక తప్పదు ఐఏఎస్ ల్లోనూ కళంకితులు వ్యాపారవేత్తలను చిరాకుపెడుతున్న బ్యూరోక్రసీ   మన అధికారగణం నిజస్వరూపమేమిటో ప్రపంచానికి మరోసారి తెలిసిపోయింది. ఆసియాలోనే మనదేశంలోని బ్యూరోక్రసీ అత్యంత అధ్వాన్నంగా ఉన్నదట. పూర్తగా తీసికట్టుగా ఉంటే పది మార్కులుగా నిర్దారించి చూస్తే, మనదేశ బ్యూరోక్రసీకి 9.21 పాయింట్లతో రేటింగ్ వచ్చింది. సింగపూర్ లోని ఓ ప్రతిష్ఠాత్మక కన్సల్టింగ్ సంస్థ ప్రపంచ దేశాల్లోని బ్యూరోక్రసీ పోకడలకు రేటింగ్ లు ఇచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, వియత్నాం, […]