అసలు లాభం ఉద్యోగులకా? కంపెనీకా? ప్రభుత్వానికా?

విశాఖ డేటా సెంటర్స్: కొత్త ఉద్యోగాలా, ఉట్టి మాటలా?

వైజాగ్ AI సిటీ: అక్కడ ఉద్యోగాలు చేసేది మనుషులా, లేక రోబోట్లా?

మీరు చూస్తున్న ఈ భారీ Google పెట్టుబడి విశాఖపట్నం (Vizag) తలరాతను మారుస్తుందా? ఇది డేటా సెంటర్ ఎక్స్పర్ట్ సారధి మోటమర్రి గారితో నా ఇంటర్వ్యూ. 

**AI రెవల్యూషన్ వరదలో మీ ఉద్యోగాలు కొట్టుకుపోకుండా ఉండాలంటే ఏమిజరుగుతోందో మీరు తెలుసుకోవాలి. అందుకే, ఈ వీడియో చూడటం ముఖ్యం. ** 

**ప్రశ్న 1: నిజంగా వేలల్లో ఉద్యోగాలు వస్తాయా?**

రాష్ట్ర నాయకులు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కానీ, డేటా సెంటర్లంటే ఆటోమేషన్ ఎక్కువ ఉంటుంది కదా? మరి, 1.88 లక్షల జాబ్స్‌లో అసలు పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని? నిజమైన టెక్ జాబ్స్ ఎన్ని? ఆ సంఖ్య చూస్తే మీరు షాకవుతారు!

**ప్రశ్న 2: అసలు లాభం ఉద్యోగులకా? కంపెనీ కా? ప్రభుత్వానికా?**

ఈ డేటా సెంటర్ వల్ల విశాఖకు వచ్చే అసలు ఆర్థిక లాభం (Economic Benefit) ఏంటి? ఇది ఉట్టి బిల్డప్ (Hype) మాత్రమేనా? లేక, వేల కోట్ల పెట్టుబడి రూపంలో, ఇంకా భారీ పన్నుల ఆదాయం రూపంలో స్థిరమైన లాభం వస్తుందా? లోకల్ ఎకానమీకి ఏది బలం ఇవ్వబోతోంది?

**ప్రశ్న 3: వైజాగ్ ‘టెక్ హబ్’ అవుతుందా?**

కేవలం డేటా సెంటర్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఈ కొత్త సబ్‌సీ కేబుల్ గేట్‌వే నిర్మాణం వల్ల వైజాగ్ నిజంగా టెక్ కంపెనీలను ఆకర్షించే ప్లాట్‌ఫాం అవుతుందా? లేక, విద్యుత్, నీటి కొరత లాంటి స్థానిక సమస్యలు ఈ కలను చెరిపేస్తాయా?

సమాధానాలు తెలుసుకోవాలంటే, వీడియో మొత్తం చూడండి!