మస్కొక పెస్కీ
ఈ వ్యాసం చదివే ముందు, దయచేసి ఈ చిన్న సర్వే పూర్తిచేయరా, ప్లీజ్? ప్రెట్టి ప్లీజ్! (ఈ వ్యాసానికి, ఇందులో పొందుపరచిన వీడియో కు, ఆ సర్వే కు సంబంధం ఉంది.) https://forms.office.com/r/V4DWnHiQ74
ప్రపంచంలో అందరికన్నా సంపన్నుడు ఇలాన్ మస్క్. అతడి ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్లు. ట్రంప్ గెలవడానికి 200 మిలియన్ డాలర్లు వెచ్చించాడు. ట్రంప్ గెలిచాడు. అగ్నికి ఆజ్యం జత అయింది. ప్రపంచంలో అత్యధికమైన అధికారం ఉన్నవాడికి అత్యధికమైన సంపద వున్నవాడు తోడయ్యాడు.
ప్రస్తుతానికి మస్క్ ట్రంప్ కు కుడిభుజంలా ప్రవర్తిస్తున్నాడు. మానసిక వ్యాధులతో మగ్గుతున్న వీరువురు ఎంతకాలం జతగా ఉంటారో తెలీదు. వాళ్లిద్దరూ కలిసి ఉన్నంత కాలం, వారిద్దరి మనోరుగ్మత మనపాలిట శాపం. ట్రంప్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వాడొక రాక్షసుడు. ట్రంపిజం ఒక పైశాచిక శక్తి. వాడి అనుచరులు ఒక రక్కసి మూక. ఆ రక్కసి మూకలో అతి శక్తివంతుడి మస్క్. అసలు మస్క్ ఎవరో, ఎలాంటివాడో మీకు కొంతవరకు తెలియజెప్పాలన్న సంకల్పంతో చేసిన వీడియో ఇది.
ఇందులో నేను అమెరికా ఎన్నికల ఫలితాలు అలా ఎందుకు వచ్చాయో వివరించాను. Transgender వ్యక్తులు ఈ ఎన్నికల్లో ఎలా పావులుగా వాడుకోబడ్డారో చెప్పాను. ట్రాన్స్ ఫోబియా ను ఆధారాలతో వివరించాను. Transgender విషయం మస్క్ కు ఎందుకంత personal అని వివరించాను.
మస్క్ తోడు ఉన్నా లేకున్నా ట్రంప్ నియంత అవబోతున్నాడు. మస్క్ డబ్బు ట్రంప్ కు ఇప్పుడు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ ఖజానా, అధికార యంత్రాంగం అంతా తనవే అని భావిస్తాడు, అలానే ప్రవర్తిస్తాడు కనుక.
ట్రంప్ భక్తులకు, ఓటర్లకు జరగబోయే ముప్పు అర్ధం కావడంలేదు. ట్రంప్ జైలుకు వెళ్ళి, తాను క్షమాభిక్ష వేసి విడుదల చేయించిన నేరస్తులను, సరిహద్దు నేరస్తులను, అనర్హులను, అసమర్ధులు తన administration లో చేర్చుకోబోతున్నాడు. ఇది గమనిస్తే చాలు మీకు అర్ధం అవుతుంది – ఏంజరగబోతోందో..
ముందుంది మొసళ్ళ పండగ. Oligarchy – ఖాయం. నియంతృత్వం ఖాయం.