గవర్నర్ షాకింగ్ సలహా: పాస్పోర్ట్ వెంటపెట్టుకుని బైటకు వెళ్ళండి

ICE అధికారులు ప్రజలను అదుపులోకి తీసుకుని, వారి పత్రాలను (credentials) తనిఖీ చేయడం గురించి ప్రిట్జ్‌కర్ ఇలా వర్ణించారు:

“వాళ్లను కారు వెనుక భాగంలో, కారులో బంధించి ఉంచారు, దాదాపు 3 గంటలు ఉంచినట్టు చూశాం. ఆ తర్వాత, వాళ్లకు తీరిక దొరికినప్పుడు, మీరు US పౌరులా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ల డేటాబేస్‌లను చెక్ చేస్తూ కాలం గడుపుతారు. ఇది చాలా విస్తృతంగా ఉంది. కనీసం చెప్పాలంటే, ఇది చాలా అవమానకరం.”

ICE అధికారులు ప్రజలను 3 గంటలు బంధించి ఉంచుతున్నారని, వాళ్లు US పౌరులా కాదా అని డేటాబేస్‌లు చెక్ చేస్తున్నారని, ఇది చాలా అవమానకరమని ప్రిట్జ్‌కర్ అంటున్నారు.

చికాగోలో సైనికుల మాదిరిగా దుస్తులు ధరించి తిరుగుతున్న ఫెడరల్ ఏజెంట్ల చర్యల గురించి, పత్రాలు చూపించమని డిమాండ్ చేయడం గురించి ఆయన ఇంకా ఇలా అన్నారు:

“ఆ CBP లీడర్ గ్రెగొరీ బీవినో (Gregory Beavino) తన సిబ్బందికి హరాస్ (harass) చేయమని, హింసాత్మకంగా షేక్‌డౌన్ (shake down) చేయమని, టాకిల్ (tackle) చేయమని ఆర్డర్లు ఇస్తున్నాడు. వాళ్లను తొలగించమని నేను ఆయన్ని (ట్రంప్‌ను) బతిమాలుతాను.”

CBP లీడర్ హరాస్ చేయమని, హింసించమని ఆర్డర్లు ఇస్తున్నాడని ప్రిట్జ్‌కర్ తీవ్రంగా విమర్శించారు. అందుకే ట్రంప్‌ను ICE అధికారులను తొలగించమని బతిమాలుతానన్నారు.

– ప్రొఫెసర్ మోహన మురళీధర్