మీరు US సిటిజెన్‌షిప్ (పౌరసత్వం) తీసుకోవాలనుకుంటున్నారా? మీ అమెరికన్ సంతానానికి OCI కార్డ్ ఇప్పించాలనుకుంటున్నారా? లేదా అకడమిక్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఈ ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పక్కాగా అర్థం చేసుకుంటేనే, మీరు అమెరికాలో శాశ్వత జీవితాన్ని ప్రశాంతంగా గడపగలరు.
లైవ్ షోలో ఇద్దరు ముఖ్య కాలర్స్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మేము చేసిన ఈ చర్చలో, ఈ కింది అంశాలపై వివరంగా మాట్లాడాం:
US పౌరసత్వం: న్యాచురలైజేషన్ సర్టిఫికెట్ (Naturalization Certificate) పాస్‌పోర్ట్ కన్నా కూడా ఎందుకు మరింత ముఖ్యమైనదో తెలుసుకోండి.
పిల్లలకు OCI: అమెరికాలో పుట్టిన మీ పిల్లలకు OCI కార్డు పొందడం… మీకు పౌరసత్వ సర్టిఫికెట్ లాంటిదే అవుతుంది. అది ఎందుకనేది మేము వివరించాం.
అకడమిక్ కెరీర్ & గ్రీన్ కార్డ్: EB-1 మరియు EB-2 National Interest Waiver (NIW) వంటి ఫాస్ట్-ట్రాక్ గ్రీన్ కార్డ్ ఆప్షన్స్‌తో అకడమిక్ ఫ్యూచర్ నిజంగా సాధ్యమేనా? దీనిపై మా అనుభవాలను పంచుకున్నాం.
– ప్రొఫెసర్ మోహన మురళీధర్