అమ్మ మీద వ్యాసం వ్రాద్దామనిపించింది. మెదలుపెట్టాక తెలిసింది వ్యాసం కాదది గ్రంధం అవుతుందని. చదివే ఓపిక మీకు ఉండదని. అందుకే -మూడే మూడు వాక్యాలు.
1977 (దివిసీమ) తుఫానులో ఇళ్ళు కూలిపోయిన వందలాది ఇరుగు పొరుగులకు ఎంతో శ్రమకోర్చి మాఇంట్లో ఆశ్రయం ఇచ్చి వారి కుటుంబాలను కాపాడిన దేవత/hero మా అమ్మ. చిన్నప్పుడు బడికి వెళ్లేముందు అమ్మ నా గడ్డం ఎడమ చేత్తో పట్టుకొని కుడిచేత్తో పాపిట తీసి దువ్వుతున్నప్పుడు అమ్మను ఆలింగనం చేసుకున్న మధుర క్షణాలు ఎప్పుడూ మరువను. కాని, ఊహ తెలియని పసిపాపగా ఆడి, ఆడి, అలసి, సొలసి, అమ్మవడిలో నిశ్చింతగా నిదురపోయిన జ్ఞాపకాల జాడ లేదు. ఆ జ్ఞాపకాలు నాకు కావాలి! అందుకు నేనేమి చేయాలి?
Happy Mother’s Day!
దేవతలంతా ఒకవైపు –
అమ్మ ఒక వైపు –
ఎవరు కావాలంటే,
మొగ్గేను అమ్మవైపు!-DR C. నారాయణ రెడ్డి
Sir, meeru cheppindi.. nalugu vaakyaalee.. kaani aa naalugu vaakyaalalo mee amma meeda unna premani enta chakkagaa cheppaaru sir.. hats of to you..