జ్ఞాపకం (Published in Telugu Velugu Feb 2013 issue) by Varun Parupalli
సాయంత్రం ఆరున్నర కావొస్తుంది… సికిందరాబాదు నుండి గుంటూరు వెళ్ళే ‘గోల్కొండ’ రైలు అప్పుడే మధిర స్టేషన్ దాటుతుంది. శ్రావణమాసం కాబట్టేమో, ముసురు పట్టినట్టుగా పొద్దుటినుంచి వాన పడుతూనే ఉంది. ప్లాటుఫారం పక్కనే గుడిసెలో ఉంటూ…