ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం… అంత కన్న అతి చిన్నది యవ్వనం.
యవ్వనం, జీవితంలో ఒక మధురమైన దశ. మనిషి యవ్వనంగా కనిపించాలని ఎప్పుడూ కోరుకుంటాడు.
అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, దాని కోసం మనుషులు చేసే ప్రయత్నాలే నవ్వు తెప్పిస్తుంటాయి.
బాబు గారినే తీసుకోండి.
బాబు గారి పదవ తరగతి లోనే మనవాడికి యవ్వనపురుగు కాటు వేసింది.
కౌమారదశ (అంటే Adolescence) కూడా దాటకముందే మీసాలు తొందరగా రావాలని రోజూ షేవ్ చేసేవాడు. మీసాలొస్తే పెద్దొడైపోయినట్టు!!
వాడి వయసు పిల్లల్తొ కాకుండా వాళ్ల అన్న ఫ్రెండ్స్ తో తిరిగేవాడు.
వీడి బాధ చూడలేక పదిహేనేళ్ళ కాలం గిర్రున తిరిగింది. బాబుగారు ఇప్పుడు ఒక కంపనీ లో ఉద్యోగి. పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడు.
ఇప్పుడు కూడా వాడికి యవ్వనంగా కనిపించాలనే కోరిక చావలేదు.
అప్పట్లో మీసాలు రావాలని రోజు గడ్డం చేసుకునే వాడు. ఇప్పుడు అవే మీసాలు కనిపించకూడదని రోజూ షేవ్ చేస్తున్నాడు.
మీసాలు లేకపోతే వాడు బాలా కుమారుడన్నట్టు!!
పాపలు లేకపోతే బాగోదు కదా ఎక్కడైనా? సో, పాప గారు ఇప్పుడు మన సబ్జెక్ట్.
అదేంటో అర్థం కాదు… డ్రెస్సులు వేసుకొనే రోజుల్లో చీర కట్టుకొనేది.
పండగొచ్చినా పబ్బమొచ్చినా కొత్త చీర కొనక తప్పదు. చీర కట్టి అలా వీధిలో నడుస్తుంటే అంతా తమ తమ పనులు మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండేవాళ్ళు. కారణం ఆమె పెద్ద అందగత్తె అని కాదు. పిట్ట పిల్ల లాంటి పిల్ల ఆ తొమ్మిది గజాల చీరలో అలా మునిగి పోయింది ఏంటి అని.
ఇక్కడ కూడా కాలం గిర్రున తిరిగి పాపకి పెళ్ళయింది. పదేళ్ళ కూతురు కూడా ఉంది. ఇప్పుడు పాపకి మళ్లీ యవ్వనం మీద గాలి మళ్ళింది.
అర్జంటు గా ఇరవై సం|| అమ్మాయిలా కనిపించే ప్రయత్నాల్లో పడింది.
ఈమె పుణ్యమా అని వీళ్ళ ఇంటి పక్కన పార్లర్ ఓనర్ ఒక కారు కొనుక్కుంది. కొడుకులని అమెరికా పంపింది.
ఈమె మాత్రం పొట్టి & బిగుతు బట్టల్లో తన శరీరాన్ని కుక్కి పదహారేళ్ల బాలా కుమారిలా పోజిస్తుంది.
GOD, PLEASE SAVE THEM!!!
correcte… kani, Manmadhudu cinemalo cheppinattu “suit vesukogane saripodu suit ayye panulu kooda cheyyali / scent kottukogane saripodu, decent ga undaali” ani naa uddesyam.
naakenduko ee babu, papa lu chesedi correct ga ne anipistundi. sollu kaburlu, kula sanghaalu pettekante, idee better kada ! emantaaru ?
-Kanaka