SUDHA RAAGAM Mini Serial Episode 12

సాయంత్రం sudha వాళ్ళింటికి వెళ్తాడు jay.నానమ్మ కి ఎలా ఉందని అడుగుతుంది sudha వాళ్ళమ్మ .
ఇపుడు బానే ఉన్నారు aunty hospital నుండి dischrarge చేసారు ఇంట్లో ఉంది అని చెప్తాడు . Sudha room లో ఉందంటే వెళ్తాడు . Meena కూడా అక్కడే ఉంటుంది . Jay విపరీతమయిన కోపంతో
మీరేం చేస్తున్నారో మీకు అర్ధం అవ్తుందా అసలు …చిన్నప్పటి నుండి వాడంటే ఇష్టమని propose చేస్తా అని తీరా వాడు చెప్తే వాడిని అనరాని మాటలని వస్తావా …అసలేంటి నీ ఉద్దేశ్యం ….బుర్ర పని చేస్తుందా పిచ్చెక్కి చేస్తున్నావా ఇలాంటి పనులు అంటాడు sudha ని .

ఆ మాటలకి meena నీకేం తెలుసు రా వాడు చేసింది చెప్తే నువ్వు వాడి మొహం చూడవు …నీకెందుకు లే చెప్పడం అని ఇన్నాళ్ళు దాచి పెట్టాం అంటుంది . ఏంటి అంత పెద్ద తప్పు వాడేం చేసాడు అంటాడు Jay. వాడు sravya కి propose చేసాడు తెలుసా …ఆ పిల్ల ఒప్పుకోలేదు అందుకని ఆ పిల్ల friendship కూడా వదిలేసాడు ….సరే అది వదిలేయ్ …మరిప్పుడు ఒచ్చి దీనికి I love you చెప్తాడా …అసలేం మనిషి వాడు అంటుంది .

ఆగాగు వాడు Sravya కి propose చేసాడా ఎపుడు ఎక్కడ …..అసలేవరు చెప్పారు మీకు అంటాడు . Alankritha resorts లో అపుడు class అంతా వెళ్లారు గా Sravya నే చెప్పింది మాతో అంటుంది . వాడు Sravya కి I love you చెప్పడం ఏంటి ….అంతా అయోమయం గా ఉంది .
అసలు నేను మీకొక విషయం చెప్పాలి ….Sravya కి నేను propose చేసాను ….తను మనకు పరిచయమైన వారం రోజులకే …తనోప్పుకోలేదు …నా మీద అలంటి ఉద్దేశ్యం లేదు …..
sorry అంది . నేను సరే వదిలేయ్ మనసులో పెట్టుకోకు friends లా ఉందాం అన్నాను . సరే కాని నాకు Abhi అంటే ఇష్టం నేను తనని మొదటి చూపు లోనే ఇష్టపడ్డాను ఈ విషయం Abhi కి చెప్పడం లో సహాయం చేయమంది . నేను Abhi ని Sudha చిన్నప్పటి నుండి ఇష్టపడుతుంది …మాకు తెలిసి వాడు కూడా ఇష్టపడుతున్నడనే అనుకుంటున్నాం .వాళ్ళ ప్రేమ మద్య లోకి నువ్వు రావద్దు అని కాస్త కోపంగా చెప్పను . అవునా సరే ఐతే నేనింక చెప్పను అంది . ఇదీ జరిగింది …మీకెందుకు లే ఇదంతా చెప్పడం అని చెప్పలేదు అంటాడు jay.

అంతా విని Sudha Meena చాలా ఆశ్చర్యపోతారు …..మరి sravya అలా చెప్పిందేంటి ….కాని Abhi propose చేయకపోతే తనెందుకు అదంతా చెప్తుంది అంటారు .
Jay అదే నాకు అర్ధం కావడం లేదు …ఒకవేళ Abhi Sravya ని ఇష్టపడుంటే propose చేసుంటే Sravya ఎందుకు ఒప్పుకోదు తనకి ఇష్టమే కదా Abhi అంటే ….మరి వాడికి Sravya ఇష్టమైతే
నాతో నేను చిన్నప్పటి నుండి Sudha ని ఇష్టపడుతున్న అని ఎందుకు చెప్తాడు అంటాడు . ముగ్గురు ఆలోచనలో పడతారు .

మర్నాడు అందరు కలిసి Sravya ని Abhi ని ఒక చోట చేర్చి మాట్లాడించాలి అనుకుంటారు . Vikram కి కూడా విషయమంతా చెప్తారు .