అమ్మ..
అమ్మ మీద ఎన్నో పాటలు వచ్చి వుంటాయి. ఎన్నో గొప్ప గొప్ప పాటలు, తెలుగు, తమిళం, హిందీ మరే భాష అయినా సరే. కాని, ఈ పాటలో ఎందుకో తెలీదు విపరీతమైన ఆర్ద్రత వినిపించింది నాకు. భాష అర్థం కాక పోయినా భావం అర్థం అయింది. ఇందుకోనేమో వీళ్ళని సరస్వతి వరప్రసాదులు అంటారు. ముఖ్యంగా పాటలో అతను అరిచే అరుపు గురించి చెప్పాలి. అలా అరవాలని నేను ప్రయత్నిచాను. గొంతు బొంగురు పోయింది కానీ, ఒక్క శాతం కూడా తృప్తి అని పించలేదు. ఆ అరుపు నిజంగా గుండె లోతుల్లో నుంచి వచ్చిందే. నా తమిళ స్నేహితుడిని అడిగాను, ఈ పాట అర్థం ఏమిటని. అతని అమ్మకి బాగాలేకపోవడమో, మరణించడమో జరిగివుంటుంది, ఆ బాధ చెపుతున్నాడు అని అన్నాడు. నిజంగా ఆ పరిస్థితిని ఊహించుకొని, అంతగా పాటలో జీవించిన రెహమాన్ జన్మ ధన్యం. విన్న మన జన్మ కూడా ధన్యం. వినండి మీరు తప్పక వప్పుకుంటారు.
[media id=22 width=480 height=20]