మంది ఎక్కువ ఐతే మజ్జిగ పలుచనే మరి!
న్యూస్ చానల్స్ ఎక్కువై పోయి ఏమి చూడాలో, ఏది చూడాలో తెలీని పరిస్తితులకు నేను పట్టిన సామెత సరిపోతుంది. కనీసం పది న్యూస్ చానల్స్ వున్న మన Aప్రదేశ్ లో, ఏమి వార్తలు రాయాలో తెలియని అయోమయం. ఎప్పుడు చూడు బ్రేకింగ్ న్యూస్, ఏది చూడు బ్రేకింగ్!
ఎవరో ఇద్దరు సహా నటీమణులు మరియు ఇంకొక విదేశి వనిత ఒక అపార్ట్మెంట్ లో విటులతో వుంటే, మన పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇది వార్త. ఇప్పటికి రెండు రోజులు, ఇంకా ఈ బ్రేకింగ్ న్యూస్ విరుగుతనే వుంది.
ఏమిరా పరమాత్మా, ఈ పరీస్తితి? అంత ఇంట్రెస్ట్ లేకుంటే చూడడం మానెయ్యండి అనొద్దు, ఆ వాదన నిలువదు.
మహాశయా ! మీకు ఇంతకంటే విషయమే దొరకలేదా ఇక్కడ పోస్ట్ చెయ్యడానికి … నా కైతే మీరు ఉదహరించిన చానల్స్ కీ మీకు తేడా తెలీలేదు
మనసులో పెట్టుకోకండి
మీ శ్రేయోభిలాషి
ఇదేమిటండి, వురిమి వురిమి మంగళం మీద పడినట్టు, మద్యలో నేనేమి చేశాను? మీ అభిలాష ఏమిటో సరిగా చెప్పండి మహాప్రభో ! 🙂
దీనివలన ఏమి ఉపయోగం వుందో నాకు అర్థం కాలేదు .. మీరు మంచి ఉపయోగమైన పోస్ట్ లు పెడతారు ఈ బ్లాగ్ లో ఇదెందుకు పెట్టారో తెలేయటంలేదు … please avoid