షాపింగ్ సుబ్బారావుతో పందెమా? దమ్ముంటే Costco!

దమ్ముంటే Costco!

అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర షాపింగ్ టిప్స్ చాల చాలా తెలుసుకోవాలని మా మామగారు అంటుంటారు.
నా ఫ్రెండ్ సుబ్బారావు ఇంటిపేరు ఏమిటో చాల మందికి తెలీదు. షాపింగ్ సుబ్బారావు గా పిలువబడే అతని ఇంటిపేరే షాపింగ్ అన్నమాట. షాపింగ్ టిప్స్ లో competition అంటూ ఏదైనా ఉంటె, అందులో సుబ్బారావు అలవోకగా నేగ్గేస్తాడు.
మీరేమైనా సుబ్బారావు తో షాపింగ్ టిప్స్ మీద పందెం కడతారా?
అయితే, దమ్ముంటే Costco!

————————–

ఇంతకీ ఎవరీ సుబ్బారావు ఏమాతని కథ?
సుబ్బారావు పేరు చెప్పగానే, అతని ఫ్రెండ్స్ అబ్బో అంటారు. బ్రతక నేర్చిన వాడు. తిమ్మిని బమ్మి చెయ్యగలడు. పది డాలర్లతో ఇరవై డాలర్ల విలువ గుంజగలడు. అమెరికాకు వచ్చిన ఈ  అయిదేళ్ళలో, ఇక్కడి జీవనాన్ని కాచి వడపోశాడు.
Money management లో Reserve Bank Governor సుబ్బారావు గారు, మన సుబ్బారావు ముందు దిగదుడుపే.
Alan Greenspan గాని Ben Bernanke గాని సుబ్బారావును సంప్రదించితే ఈపాటికి అమెరికా ఆర్ధిక వ్యవస్థ ను పునరుద్ధరించగలిగేవారు.

చాల రోజుల తర్వాత మొన్న సుబ్బారావు ను Costco లో కలిసాను.

  • సుబ్బారావు: మురళి గారు – ఎలావున్నారు.
  • ఆ సుబ్బారావు గారు, surprise surprise. New Jersey లో కదా వుండటం. Visitకు వచ్చారా?
  • సుబ్బారావు: లేదండి ఇక్కడకు move అయ్యి ఒక నెల అవుతోంది. వచ్చి కలుద్దాం కలుద్దాం అనుకుంటున్నాను. మా ఆవిడను కూడా పరిచయం చెయ్యాలి కదా మీకు. మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా? అన్నట్లు, ఏమిటి తల అడ్డంగా shake చేసుకుంటూ వస్తున్నారు? ఎవడన్న కేసు తగిలాడా?
  • ‘తగిలాడు’ కాదు . తగిలింది. పావుగంట పైన తిరిగితే ఒక పార్కింగ్ స్పాట్ దొరికింది. అందులోకి పుల్ చేయ్యబోయానో లేదో, ఒకావిడ ఎక్కడినుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ space మధ్యలో చేతులు అడ్డంగా సాచి నిలబడింది. ఇండియాలో మనం బస్సులో సీట్ రిజర్వు చేసుకోవడానికి కర్చీఫ్ వేసినట్లుగా. అసలూ….
  • సుబ్బారావు: అయ్యబాబోయ్. ఆగండాగండి.. అదిగో అక్కడ returns దగ్గర purple చుడిదార్ వేసుకొని పాపను ఎత్తుకున్నావిడేనా?  ఆవిడే మా ఆవిడ – కవిత! తను వద్దు అంటూనే వుంది, నా గోల పడలేక…

ఇంకేమంటాను? వెధవ మొఖం ఒకటి పెట్టి అవును కాదు మధ్య తలూపాను. ఇంకా నయం, నేననుకున్నదేదో బైట పెట్టేశాను కాదు. బ్రతక నేర్చినవాడు కదా – తనే మాట మార్చాడు.

  • సుబ్బారావు: మురళి గారు – ఇతను నా cousin కామేష్. ఈ  వారమే ఇండియా నుంచి H1-B మీద వచ్హాడు. అమెరికాలో షాపింగ్ experience ఎలావుంటుందో చూపిద్దామని తీసుకొచ్చాను. షాపింగ్ అక్షరాభ్యాసానికి Costco కంటే  మంచి ప్లేస్ ఏముంటుందో చెప్పండి.

PHD తొ కలిపి  నాకు నాలుగు డిగ్రీలు ఉన్నాయి. అయినా,  షాపింగ్ పరిజ్ఞానంలో సుబ్బారావు తో పోల్చుకుంటే నాకు అ ఆ లు కూడా రానట్లే. నాకప్పుడు అనిపించింది అప్పారావు గురించి ఇన్ని కథలు చెబుతారు, ఇతగాడి షాపింగ్ తీరు ఎలా వుంటుందో తెలుసుకోవాలని. నేనొక ఈగలా మారి తన షాపింగ్ కార్ట్ మీద వాలిపోయి కామేష్ కు ఏమేమి టిప్స్ చెబుతాడో చూడాలనిపించింది

అలా అనిపించిందో లేదో…… [sound effects]
[with echo ] Boom! – నేనొక ఈగలా మారిపోయాను. ముందు భయపడ్డాను నేనేదో అయిపోయానని. ఇంతలో గుర్తొచ్చింది. మొన్న దేవుడు గార్ని మా ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు, మా ఆవిడ చేసిన వంట ఆయనకు విపరీతంగా నచ్చేసి, మమ్మల్ని ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు – నేను అప్పుడే అవతార్ సినిమా చూసోచ్చానేమో నేను అనుకున్న రూపంలోకి మారిపోయే వరం అడిగాను. ఆయనేమో సరే అన్నాడు. మా ఆవిడ ఏమడిగిందో మీకు తర్వాత చెబుతాను. నేనయితే ఆ వరాన్ని ఇదే 1st time  ఉపయోగించడం అన్నమాట. నేను ఈగలా మారాక సుబ్బారావుకు కామేష్ కు నేనేమయిపోయానో అర్ధం కాలేదు. బుర్ర గోక్కుంటూ షాపింగ్ కార్ట్ నెట్టుకొంటూ electronics వేపుకు వచ్చారు. నేనేమో, వాళ్ళ కార్ట్ మీద వాలి ride చేస్తున్నాను.

  • కామేష్: [రాయలసీమ యాసలో] ఏందన్నఈ  మూలనే ఇన్ని కంప్యూటర్లు కెమెరాలు, టీవీలు ఉండాయి? మనకాడ హైదరాబాద్ లోగూడ ఏ షాప్ లోను ఇన్ని ఎలేక్ట్రోనిచ్స్ ఉండవే. అసలు షాప్ సూడు ఎట్టా జిగేల్ మంటందో! షాప్ అంతా ఉత్తినే తిరగనీకి ఓ గంటన్నా పట్టేట్టు ఉండాది.
  • సుబ్బారావు: దీన్ని wholesale warehouse అంటారులే. ఈ  Costco లాగానే Sam’s Club, BJ’s అని ఇంకో రెండు స్టోర్స్ ఉన్నాయి. అవికూడా ఇలాంటివే గాని, మన తెలుగోళ్ళు ఈ  Costco కే ఎక్కువ వస్తుంటారు.

అలా కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా చెబుతూ Digital cameras దగ్గర ఆగారు. Nikon SLR camera information పరిశీలించి, దాన్ని కార్ట్ లో  పడేసాడు సుబ్బారావు.

  • కామేష్:  అదేంటన్న మొన్ననే మనింటికి ఇట్టంటిది ఓటి పోస్ట్ లో వచ్చింది గందా. మళ్ళీ కొంటండావేంది? ఈడ అన్ని తిరిగిచ్చేయొచ్చు అంటావుండావు  గందా, అది ఇచ్చేస్తండావా?
  • సుబ్బారావు: మనింటికి వచ్చింది refurbished item రా.  అలాంటివి all sales are ఫైనల్. అందుకే, అది అమ్మినవాడు తిరిగి తీసుకోడు. కాని ఈ  Costco వాడు తిరిగి తీసుకుంటాడు.

కామేష్ అర్ధం కానట్లు చూసాడు.

  • సుబ్బారావు: మనం ఏమి చేస్తామంటే, ఆ mail order లో వచ్చిన  refurbished item ను ఈ  బాక్స్ లో పెట్టి Costco లో తిరిగిస్తామన్నమాట. అంటే, refurbished item cost కు మనకు కొత్తది వచ్చింది.
  • కామేష్: అట్టాగూడ  చేయొచ్చన్నా? ఇలాజేస్తే ఎంత మిగులుద్దన్నా?
  • సుబ్బారావు: ఓ ఏభై డాలర్లు
  • కామేష్: అంటే – రెండువేల రూపాయలకు పైనే.

ఆ క్షణంలో నాకు అనుభవం అయ్యింది ఈగకు తల తిరగడం అంటే ఎలా వుంటుందో. కామేష్ తన అన్న వంక గర్వంగా చూసాడు. విశాలమైన ఆ అంగడి లో వాళ్ళ పయనం కొనసాగింది. Furniture aisle దగ్గరకు రాగానే – సుబ్బారావు కామేష్ ను పురమాయించాడు.

  • సుబ్బారావు: కామేష్, ఆ పెద్ద కార్ట్ తీసుకురా.
  • కామేష్: ఎందుకన్నా?
  • సుబ్బారావు: Next weekend పాప birthday party పెట్టుకున్నాం కదా. ఒక ఇరవై కుర్చీలు నాలుగు tables తెసుకెళదాం.
  • కామేష్: ఇయన్నీ పెట్టుకోడానికి చోటే డదన్న  మనకాడ?
  • సుబ్బారావు: ఒక వారేమే గదరా. పార్టీ అయిపోగానే తిరిగిచ్చేస్తే సరిపాయే

నాకయితే ఇది ఎక్కడో తగిలింది. బక్క ఈగను కదా – కొంచెం తట్టుకోలేక పోయాను.
వాళ్ళ Next stop – bakery . రక రకాల breads samples పెట్టి customers ను ఆ breads కొనమని ప్రోత్సహిస్తోంది ఒక sales మహిళ. బ్రెడ్ ముక్కలు తీసుకొని రెండు కామేషుకిస్తూ అన్నాడు సుబ్బారావు:.

  • సుబ్బారావు: ఆకలి అవుతుందిరా వదిన పాపను తీసుకొని బాత్రూం నుంచి వచ్చేలోపు ఒక శాంపిల్ రౌండ్ కొట్టి వద్దాము రా.

శాంపిల్ రౌండ్ అంటే మందు అయి వుండదు, రోడ్ మీద తిరిగి రావడమో, దమ్ముకొట్టి రావడమో అనుకున్నట్లున్నాడు కామేష్. అతని ముఖంలో confusion చూసి సుబ్బారావే మళ్ళీ  అన్నాడు

  • సుబ్బారావు: శాంపిల్ రౌండ్ అంటే, వీళ్ళు  పెట్టిన food samples అన్నీ ఒక సారి రుచి చూసి రావడం. షాపింగ్ చేసేప్పుడు రెండో రౌండ్ వేస్తామన్నమాట.

అలా ఒక శాంపిల్ రౌండ్ వేశారు. Second round నడుస్తుండగా fruits దగ్గర ఆగారు.

  • కామేష్: ఇందేందన్న, ఈడ ఈ  సీజన్లో లోగూడ మాగాయలు అమ్ముతార? చిత్రంగా ఉండాదే. ఇయ్యి మన బంగనపిల్లి అంత బాగుంటాయ?
  • సుబ్బారావు: బంగినపల్లి అంత బాగోవు కాని, OK

మామిడికాయలు తొమ్మిదేసి ఉన్నాయి open-boxes లో. పండబోతున్న మంచి కాయలున్న బాక్స్ ఒకదాంట్లో కాయలన్నీ బాగా కుదించి, పక్క బాక్స్ లోని  ఓ మూడు కాయలను ఇందులో సర్దాడు. ముక్కున వేలేసుకున్దామనుకున్నాను. సుబ్బా రావు ఏమి చేస్తున్నాడో నాకు తెలుస్తోంది.  ఈగకు ముక్కు, వేలు ఎక్కడ ఉంటాయో తెలియలేదు. ఈ  సారి రూపు మార్చేముందు గూగుల్ సెర్చ్ చేసి ఆ జీవి anatomy పూర్తిగా తెలిసి మరీ మారాలి అని నిశ్చయించుకున్నాను.

  • కామేష్: ఈడ మన చిత్తూరులో లాగ లెక్కెట్టి అమ్ముటారా లేక హైదరాబాద్ లో లాగ తూకమేసి అమ్ముటారా?
  • సుబ్బారావు: రెండూ కాదు – అక్కడ రాసి వుంది చూడు. బాక్స్ లెక్క.
  • కామేష్: మరయితే ఆటన్నిట్లోను తొమ్మిదే ఉన్నైగా మరి గిదేంది, నువ్వు పన్నెండు ఎట్టుకొచ్చినావ్?
  • సుబ్బారావు:ఇష్…. మెల్లిగా మాట్లాడారా, వాళ్ళెవరూ లెక్క చూడర్లేర. అంతే కాదు, మనం self -checkout లో వెళతాం. గేటుకాడ వాడు పట్టించుకోడు.
  • కామేష్: వామ్మో… నీకాడ  చాల ట్రిక్కులున్నాయన్న
  • సుబ్బారావు: అందుకేరా నన్ను షాపింగ్ సుబ్బారావు అంటారు. [గర్వంగా]

అప్పటిదాకా నన్ను స్టోర్ అంతా వెతుక్కుంటున్న మా ఆవిడ అక్కడకు వచ్చింది. నాకయితే మహా సరదా వేసింది. నన్ను చూడలేదు, చూసినా గుర్తించలేదు. అనుకున్నాను అలా. కాని నా వంక సూటిగా చూసింది. చూసి నవ్వింది. ఆ నవ్వులు కోటి అర్ధాలు. అన్నింటికన్నా మిన్నగా – నువ్వెవరో నాకు తెలుసులే అన్నట్లు ఉండి ఆ నవ్వు.  సుబ్బారావు ను పలకరించింది. నేను కనపడి మాయం అయిపోయానని చేప్పాడు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు లెద్దూ అని తను స్టోర్ లో మరో వైపుకు వెళ్ళిపోయింది.
సుబ్బారావు, కామేష్ తర్వాత Diapers సెక్షన్ దగ్గర ఆగారు.

  • సుబ్బారావు: ఇవేంటో తెలుసా?
  • కామేష్: పిల్లకాయల డైపర్లు గదన్న? ఇప్పుడు మనకాడగూడ దొరుకుతున్నాయి గందా? అన్నట్టు నాకో డౌట్ అన్నా.
  • సుబ్బారావు: ఏమిటో
  • కామేష్: మరి నువ్వు రెండేళ్ళు వాడిన furniture తిరిగి ఇచ్చేసినా అన్నావ్. ఇందాక వదినేమో సగం తినేసాక కుళ్ళు orange వచ్చిందని oranges బాక్స్ తిరిగిచ్చేసింది. ఇలా అన్ని తిరిగిచ్చేయోచ్చుకందా? వాడిన దిఅపెర్స్కూడా ఈడ తిరిగిచ్చేయోచ్చా?
  • సుబ్బారావు: చాల్లే ఊరుకోరా. ఇస్తే తీసుకుంటారేమొగాని  కాని, వీళ్ళు మాత్రం బ్రతకోద్దేమిటి?

ఇది సుబ్బారావు కామేష్ కు ఇచ్చిన  షాపోపదేసం. ఇందులో ఒక కొసమెరుపు మిగిలింది…
వాళ్ళు అటు  చెకౌట్ కు వెళ్ళాక, నేను చిక్కుల్లో పడ్డాను. ఏమైందో తెలుసుకోవాలంటే తరువాయి భాగానికి వేచి ఉండండి.

—————-

Ending (as part two)

వాళ్ళు అటు  చెకౌట్ కు వెళ్ళాక, నేను నా మానవ రూపం లోకి వచ్చేదామని నేలమీద వాలాను. ఎన్నిసార్లు మనిషిగా మారాలని విష్ చేసుకున్న కాలేక పోయాను. ఒకవేళ మంత్రమేమన్న మర్చిపోయానా?   హాం గ్రీం ఫట్… ఫ్రం  గ్రీం హట్. తూం తాం తస్స్ … చస్ ఏ మంత్రం  అవసరం లేకుండానే ఇది పనిచెయ్యలే? నాకు పిచ్చి టెన్షన్ వచ్చేసింది. ఈగకు చెమటలు పడితే ఎలా వుంటుందో మరో సారి మీకు చెబుతాను. కాని అప్పుడు  మాత్రం నాకనిపించింది కనీసం ఫోన్ అన్న చేసుకో గలిగితే దేవుడు గారిని పిలవచ్చు ఏమైందో కనుక్కోవచ్చు. నా అదృష్టం బాగుంది. ఇంతలో దేవుడు గారే వచ్చారు ఆవుపాల నైవేద్యం కోసం – Costco లో పాలు చాల చవక అని అక్కడకు రెగ్యులర్ గ వస్తూ ఉంటారంట. [Put Echo for voice of God]

  • స్వామీ స్వామీ  ఏమిటిది. నాకేమయ్యింది? మీరిచ్చిన వరం ఎందుకు పని చెయ్యడం లేదు. ఎందుకని?
  • God: భక్తా.. నేను నీకు మాత్రమే కాదు, మీ ఇద్దరికీ వరాలు ఇచ్చాను, కదా?.
  • అవును స్వామీ అవును
  • God: మీ శ్రీమతి  అడిగిన వరానికి నువ్వు మనిషిగా తిరిగి మారక పోవడానికి సంబంధం వుంది.
  • స్వామీ అసలే టెన్షన్ లో వున్నాను మళ్ళీ ఈ  teasers ఏమిటి మహాశయా?  అంతేకాదు ఇప్పటిదాకా నా commentary అంతా echo లో వస్తే మీతో మాట్లాడేటప్పుడు నా మాట మామూలు గా వినపడి మీకు మాత్రమే echo వస్తోందేమిటి?
  • God: చూడు బాబు, నువ్వొక ప్రశ్నల పుట్టవు.  సౌండ్ engineers ఎప్పుడూ నేనిచ్చిన రూల్స్ పాటిస్తుంటారు.  నా వాయిస్ ఎక్కడ వినిపించినా echo లో వినపడి తీరాలి. నేను సూపర్ బాస్ ను కనుక, మిగతా ప్రాణులకు, స్వగాతాలకు ఇచ్చిన echo నాముందు పనిచెయ్యదు అన్నమాట. ఇక వరాల విషయం – నువ్వేమో  ఇచ్చా రూపం కావాలని కోరుకున్నావు. మీ ఆవిడేమో, ఒక్క వరం కోరుకోమంటే ఆ వరంస్థానే తెలివిగా రెండు వరాలు కోరుకుంది.
  • ఒరినాయనోయ్. నాకిది  తట్టలేదే. ఎంతైనా తనవి కృష్ణ జిల్లా తెలివితేటలు. ఆ… మరి ఆ రెండు వరాలు ఏమి కోరుకుంది స్వామీ.
  • God: నేను non-disclosure sign చెయ్యలేదు కనుక చెబుతున్నాను. తను కోరుకున్న మొదటి వరం నీ మనుసులో వున్నది ఎప్పుడూ తనకు తెలియాలని. రెండవది, నీ అభీష్టం మీద తనకు veto పవర్ కావాలని.
  • అడ్డడ్డే  మొగుళ్ళ అభీష్టం మీద ఆ veto పవర్ నువ్వు ఆడవాళ్లందరికీ ఇచ్చే పంపించావుకదయ్యా!
  • God: అనుకో. కాని, మీ ఆవిడ chances తీసుకో దలచుకున్నట్లు లేదు.
  • అంటే ఇప్పుడు నన్ను ఈగ గానే ఉండిపొమ్మని కోరు కొంటున్నదా తను?
  • God: లేదు. అది కృష్ణ జిల్లా వాళ్ళమీద  నువ్వు నోరు పారేసుకున్నందుకు నీకు కొంతకాలం పాటు తను విధిస్తున్న శిక్ష. నువ్వు నిజంగా పశ్చాత్తాప పడితే తనకు తెలుస్తుంది అప్పుడు నిన్ను క్షమిస్తుంది. సారీ మురళి, ఇప్పుడు football players prayers విని ఏ team ను గెలిపించాలో నిర్నయించాలి. వస్తాను.

వారి బాబోయ్. కృష్ణ జిల్లా వాళ్ళు losers అన్నందుకే ఇంత గోలా. ఇంకా నయం, తెలంగాణా వేర్పాటువాదిని చేసుకున్నాను కాదు. చేసుకునుంటే, KCR ను దుయ్యబట్టినందుకు నాగతి ఎమయ్యివుందేదో.

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

18 Comments on "షాపింగ్ సుబ్బారావుతో పందెమా? దమ్ముంటే Costco!"

  1. Sapta Warna | August 16, 2010 at 9:30 PM |

    Mohan garu,

    I heard the play in the TORI last Friday. It was hilarious and I was struggling hard not to laugh out loud (I was at work) . I personally feel , listening to the skit is much better experience than reading it. If possible , please post the audio version.

  2. Mohan garu, Can you please share the audio recording as well ?

  3. welcome back Bhanu garu. Hope you had a safe RETURN!

  4. Bhanu Prakash | August 16, 2010 at 6:04 AM |

    Okay,
    I need to chip in my .02.
    Though it is an embarrassment for us telugus, I have to admit that I knew few folks who did such things. Personally I have never done such things with COSTCO. The only returns I did were with Bestbuy, and with a reason. Mohan garu this (the fact that you are shedding light on such things) might not go well with many of our telugu brethren.

    • Bhanu,

      Welcome back.

      Let me emphasize a couple of things here:

      1. Not only Telugu people – a LOT of 2nd generation and later Americans (whites, blacks, Hispanics – regardless of race and ethnic background) do these things. Don’t you remember one senior official in the Bush administration who had to resign due to shoplifting charges? His antics are also in this play.

      2. As I said, there is some self criticism here. Just read between the lines.

      There is nothing wrong in trying to better ourselves with some introspection. If I am hated for speaking the truth – so be it.

  5. ఇలాంటి సుబ్బారావులు అమెరికా లో వీదికొకడు వెలిసారు ఇప్పుడు….నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది చేసేదిదే… online లో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తారు అది కాస్తా వచ్చాకా క్రెడిట్ కార్డు కంపెనీ కి కాల్ చేసి నేను కాదు ఆర్డర్ చేసింది నా కార్డు ఎవడో వాడేసి ఆర్డర్ చేసుకున్నాడు అని దబాయించడం పాపం బ్యాంకు వాడు వీడికి ఆ అమౌంట్ క్రెడిట్ ఇవ్వడం. అదేంట్రా అలా చెయ్యకూడదు మనం అంటే నిన్నెవడు ఆపాడు నువ్వు కూడా అలాగే కొనుక్కో మనకి ఉచిత సలహాలు ఇస్తారు.

  6. Mohan Garu,

    Skit is simply superb…

    సుబ్బారావు: చాల్లే ఊరుకోరా. ఇస్తే తీసుకుంటారేమొగాని కాని, వీళ్ళు మాత్రం బ్రతకోద్దేమిటి?

    super..:)))

  7. Good timely responsive. Thx for the sentiments of the viewer.

    Murali garu you are doing good job and I listen to your programmes from last July and most of them are very energetic debates and discussion. As I posted in my comments I was being critic on certain lines and not the entire play. I believe nothing is perfect and reviews comments should be win win.

    Btw any typos pardon as this being typed from mobile.

  8. మహేష్ | August 15, 2010 at 8:16 AM |

    బావుంది – కానీ, కధ ఎంత బాగా వ్రాసినా, ‘దేవుడి కి రొయ్యల వేపుడు నచ్చటం’ అన్న విషయం జీర్ణించుకోలేకపోయా – దీన్ని ‘ఇన్సిపిరేషన్’ గా తీసుకొని రేపు ఓ తలమాసిన వెధవ, వాళ్ళింటో అద్భుతం గా వండిన ‘గొడ్డుమాంసమో/పంది మాంసమో’ దేవుడికి పెట్టానని వ్రాస్తే, మన కడుపులో దేవేసినట్టుండదూ? దయచేసి, మన సంస్కృతి ని కించ పరచేలా వ్రాయకండి – సరదాకైనా, కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకోలేం..

    • You have a point on this andi. Naakidi thatta ledandi.. కాని, అది వ్రాసినప్పుడు తిన్నడు (భక్త కన్నప్ప) నా మనసులో వున్నాడు. తిన్నడు అడవిపంది మాంసం కదా పెట్టాడు శివుడికి?

      Nevertheless, I cannot undo the hurt sentiments on this point – but, my apologies to all the devotees.. I changed the text and the audio at this spot.

      • Kanaka Byraju | August 15, 2010 at 1:52 PM |

        భక్త కన్నప్ప లో శివునికి పెట్టేది జింక మాంసం మాస్టారు. అయినా మహేష్ గారు, మీ అభిప్రాయాన్ని తప్పు పట్టడం లేదు గాని, దీవుళ్ళకి రకరకాల వేషాలు వేసి, చాల కామెడీ సీన్స్ వచ్చాయి. ఎన్నో విధాల మనం నవ్వుకున్నాం. ఇంత విశాల హృదయం వున్న మనం, రొయ్యల వేపుడు ని తట్టుకోలేక పోయ్యామా? నిజంగా దేవుని గురించి మాట్లాడితే, హిందూ ప్రజలు ఆయనికి/ఆవిడకి సరైన గౌరవం ఇవ్వరు.

        • Correcte ! Okka saari Toorpu Raamyanam mimicri Gurthu techukondi ! Ramudu ,seetha Laxmanudu … entha comedy cheyyocho antha chesaru .. navvukuni vodleyyadame 🙂

        • మహేష్ | August 16, 2010 at 4:29 PM |

          భక్తకన్నప్ప పెట్టాడు కాబట్టీ, శివుడు తృప్తిగా తిన్నాడు గాబట్టీ – శివుడికి మాంసం అంటే ఇష్టమని ఒక అభిప్రాయానికి రాకూడదు – కదా? మన ఖర్మకొద్దీ, కొన్ని సినిమాల్లో వల్గర్ కామెడీలు చాలా వచ్చాయి – అలాటి చీప్ కామెడీ తో పోల్చుకోవద్దనే నా విన్నపం. మన మతాన్ని/సంస్కృతిని మనమే కించపరచుకొని, దానికి ‘విశాలహృదయం’ అని పేరు పెట్టుకోడం మనకే చెల్లుతుంది. నేను తట్టుకోలేక కాదు – దీన్ని చదివి మరికొంతమంది ఇదే పాయింటు ను మరింత దిగజారుస్తూ వ్రాయగలరు – దాన్ని మనం పరోక్షంగా ప్రోత్సహించ గూడదు కదా. I’ll stop moaning about it here and pls let us not drag it further.

          Mohan garu – thanks for changing it on the spot – listened the repeat program. Keep bringing more such high quality stuff (I know, its not an easy job to do regularly – but, try to bring something for special occasions)

  9. So in couple of months there will be outsourced sitcom on NBC. I want to know as a critic how u react.

    The way u portrayed Telugu people hurts. You are not comic writer but media anchor. Not sure in real life if any one will do that kind of shopping.

    • Sam garu,

      Nowhere in the skit I made a claim that all Telugu people shop like that. As I clearly stated in the show – some of them are made up and then there is ample self criticism in it. I have a thick skin and so I can take a joke on me. Comedy is comedy. Please take it as such.

      Furthermore, this is not anyway close to being as offensive as calling half of Telugu people looters by some people.

    • Sam garu ,

      I agree with Mohan Garu . I know more than 50(ofcourse i stopped shopping with them .. i shop all alone now ) people who do the same . This is what they do and they advise me to do so.

    • Kanaka Byraju | August 15, 2010 at 1:54 PM |

      each and every incident in this really happened and I am the proud witness. 🙂

Comments are closed.