Jay abhi meena కూడా ఆ పాపా ని చూస్తారు ……sudha కి ఒళ్ళంతా వణుకు వచ్చినట్టు ఉంటుంది …ఆ పాపా దగ్గరికొచ్చి sudha కి ఆ gift, greeting card ఇచ్చి “ అక్క ఎవరో మీకివ్వమన్నారు ” అంటుంది …..
sudha “నాకేంటి ఇది నాది కాదు నాకు ఎవరివ్వమన్నారు ” అంటుంది తడబడుతూ …
“ఏమో అక్కా మీకే ఇవ్వమన్నారు ” అని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది ….
దగ్గరి నుండి చూసి హమ్మయ్య greeting card నేను తీస్కుంది కాదు కాని gift అలాగే ఉంది ….ఎలా జరిగింది అని ఆలోచిస్తుంటుంది .
Jay card తీస్కోని open చేసి చదువుతాడు లోపల పేర్లేమి ఉండవు …..
నిరీక్షణ లో నిశ్శబ్ద రాగం …
ఆలాపించును ప్రేమ సరాగం …..
మనసెపుడో నిన్ను చేరి అయింది స్వర్గం ..
మనకెలా సాధ్యం మనసుకున్న వేగం ….
ఈ రోజు కోసం ఎన్నో రోజులు ఎదురు చూసాను …ఇంకా ఉండలేక
ఇవాళ నా ప్రేమని తెలుపుతున్నాను …..నన్ను ప్రేమిస్తావ్ కదూ ….
వామ్మో ఏంటీ కవిత్వం ఇంతకీ ఎవరికీ రా abhi నీకా లేకపోతే నాకా ” అని నవ్వుతాడు jay.
“మనకి అంత scene లేదు రా …..వీళ్ళిద్దరిలో ఎవరికో …..ఇది కూడా తీసి చూద్దాం ” అని gift తీస్కుంటాడు abhi.
Sudha కి చాలా tension గా ఉంటుంది . అక్కడి నుండి వేల్లిపోవాలో ఉండాలో తెలీక అచేతనంగా చూస్తూ ఉంటుంది .
.
Gift విప్పి చూసి shock అయితాడు abhi ఒక నిమిషం అలానే చూస్తూ ఉంటాడు . Sudha తల దించుకొని నించుని ఉంటుంది abhi ని చూడలేక .
ఒక నిమిషం ఆగి “Meena కత్హి కదా చూడు ఇందులో ఏముందో ” అని meena కి ఇస్తాడు .
Sudha తల ఎత్తి చూస్తుంది . Meena చేతిలో చూస్తుంది sudha….
ఒక glass frame లో meena వివిధ రకాలుగా నవ్వుతున్న చిన్న photoes తో
I LOVE YOU MEENA అని రాసుంటుంది …
meena కి నోట మాట రాకుండా అలాగే చూస్తుంటుంది . కింద చూస్తె Vikram అని రాసుంది . Jay abhi meena ని ఎదిపిస్తుంటారు …sudha కూడా relax అయిపోయి meena ని చూసి “congrats” అంటుంది .
“Congrats ఏంటి meena కి ఇష్టమేనా vikram అంటే ” అడుగుతారు jay abhi.
అవును దీనికిష్టమే అంటుంది sudha.
అపుడు వస్తాడు vikram “meena నేనంటే ఇష్టమేనా ” అంటూ …..meena సిగ్గు పడుతూ తల దిన్చుకుంటుంది ……hey congrats అని vikram కి చెప్తారు అందరూ .
Sudha అంతా మర్చిపోయి చాల happy గా meena ని ఆనందం గా కౌగిలించుకుంటుంది “.I love you too” అని చెప్తుంది meena vikram కి . అందరూ happy గా చాలా సేపు మాట్లాడుకుని వెళ్ళిపోతారు . Meena మొహం లో సంతోషం చూసి sudha చాలా happy గా feel అవ్తుంది . ఆ gift మాత్రం నేను ఇంటికి తీస్కేల్లను mummy వాళ్ళు చూస్తారు అని మళ్ళీ vikram కే ఇచ్చేస్తుంది meena. Greeting card తనతో తీస్కేల్తుంది ….
అలా రోజులు గడుస్తున్నాయి …sravya అపుడపుడూ కలిసి మాట్లాడుతుంది sudha meena తో ..Jay చాలా సార్లు అడిగాడు sudha ని “abhi కి love విషయం చెప్తా అన్నావు ఇంకా చెప్పవేంటి .”అని . ఏదో కారణం చెప్పి దాటేసేది sudha..ఒక రోజు చాలా కోపంగా “ఇంకో సరి అడగద్దు అలా … ఊరికే , నేను చదుకోవాలి ” అని అరుస్తుంది .
అప్పటి నుండి jay కూడా అడగడం మానేస్తాడు .
First year exams కి అందరూ serious గా prepare అయి రాస్తారు . Exams అయిపోయి hollidays వస్తాయి one month. Abhi కి కూడా అదే time లో exams అయిపోతాయి .