23న చిత్రపరిశ్రమ మూత?
23న ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడబోతున్నదా…అసలు ఇలా ఎందుకు జరగబోతోందీ…. ?
అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లేవీసర్వీస్ టాక్స్ విధించాలనుకుంటోంది. ఇదే జరిగితే నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందని భయపడిపోతున్నారు నిర్మాతలు. దీంతో ఫిబ్రవరి
23 నుంచి చిత్రనిర్మాణం నిలిపివేస్తామంటోంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అయితే, ఒక్కరోజే చిత్రపరిశ్రమ సమ్మెకు దిగుతుందా, లేక సమస్య పరిష్కారమయ్యేవరకు కొనసాగుతుందా అన్నది ప్రస్తుతానికి మనవద్ద ఇన్ ఫుట్స్ లేవు. కేంద్రప్రభుత్వం సర్వీస్ టాక్స్ పేరిట సుమారుగా
10.3 శాతంవరకు టాక్స్ వేయాలనుకుంటోంది. ప్రస్తుతానికి ప్రతిపాదన స్థాయిలోనే ఉన్నా, నిర్మాతల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఈ టాక్స్ బాదుడు జరిగితే, అనేక చిత్రాల బడ్జెట్ తడిసిమోపెడవడం ఖాయమంటున్నారు. సీనీరంగ ప్రముఖులు.
ఫిబ్రవరి ఇరవైమూడున తలపెట్టే ఒక్క రోజు సమ్మెకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తన పూర్తి మద్దతు ఇస్తుందని రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సురేష్ బాబు కూడా చెబుతున్నారు.