కోదండరాం, KCR లకు ఏమి కావాలి?

తాజా వార్త. హాస్పిటల్ లో scanning చేస్తే బయటబడ్డ KCR , కోదండ రామ్ బుర్రలలోని కొన్ని భావాలు. రాష్ర విభజనకు సంబంధించి ఇది వారి fantasy!:

Dec 2010 లో Sri Krishna Commission ఇవ్వ వలసిన తీర్పు:

ఇందుమూలముగా అందరికీ తెలియజేయునది ఏమనగా, పరస్పర స్పర్దలతో పంపకాలు చేయమని వచ్చిన తెలుగు జాతి అన్నదమ్ములకు అక్షర సంపదను ఈ  క్రింది విధముగా పంచబడినది.

– మొదటిగా భారతం. నన్నయ తెలంగాణా లో పుట్టకున్నా, అతను పుట్టిన వరంగల్ ప్రస్తుతం తెలంగాణా లో వుంది కనుక నన్నయ వ్రాసిన ఆది, సభా పర్వాలు, ఆ పైన అరణ్య పర్వంలో సగ భాగం తెలంగాణా ప్రజలకు చెందుతుంది. కాకుంటే, సహజంగానే దోపిడీ దారులు, సామ్రాజ్యవాదులు, అహంకారులు  అయినా కోస్తా తీర ప్రాంతపు తెలుగువారు నన్నయ వ్రాసిన భారత భాగాలు చదివి తమ విజ్ఞానాన్ని పెంచుకొని  తెలంగాణా ప్రజలను మరింత దోచుకొనడం వల్ల, కోస్తా తీర ప్రాంతపు ప్రజలందరూ ప్రస్తుతం తెలంగాణా జిల్లాలుగా పరిగణించబడుతున్న పది జిల్లాల వారికి 1000 సంవత్సరాల వడ్డీతో సహా నష్ట పరిహారం చెల్లించవలెను. ఇకపై, నన్నయ వ్రాసిన భారతంలోని భాగాలను తీరాంధ్ర ప్రాంతం వారు ప్రచురించకూడదు,  చదువకూడదు, అంతేకాదు ప్రస్తావించకూడదు.

– తిక్కన, ఎర్రన వ్రాసిన పదిహేనున్నర పర్వాలు తీరాంధ్ర  ప్రాంతం వారికే చెందినప్పటికీ, దశాబ్దాలుగా వారు తెలంగాణా ప్రజలపై చేసిన ఘాతుకాలకు, దోపిడీలకు పరిహారంగా, తెలంగాణా ప్రజలు తీరాంధ్ర ప్రజలకు మహా భారతానికి సంబంధించి ఏవిధమైన వాడుక రుసుము చెల్లించనవసరం లేదు.

– శ్రీనాధుడు తీరాంధ్ర ప్రాంతపు రెడ్డి రాజులను పొగిడాడు. శ్రీనాధుడు, అతని కవితలు తీరాంధ్ర ప్రాంతం వాళ్ళే ఉంచుకోవచ్చు.

– పోతన బూతన కాక మరేమిటి? అందుకే “ఆంధ్ర” అనే బూతు పదం భాగవతం ముందు పెట్టాడు. దీనికి ప్రక్షాళనగా ముందుగా శాంతి చేయించి ఆ తర్వాత “ఆంధ్ర మహాభాగవతం,” “తెలంగాణా మహాభాగవతం” గా పునర్నామకరణ చేయబడుతుంది!

– అన్నమయ్య రాయలసీమ ప్రాంతం వాడుకనుక, అన్నమయ్య కీర్తనలు పాడుకున్నందుకు, పాడుకోబోతున్నందుకు తీరాంధ్ర ప్రాంతం వారు రాయలసీమ ప్రజలకు రుసుం చెల్లించాల్సి వుంటుంది. అలాగే తిరుపతి వెళ్ళిన తీరాంధ్ర ప్రజలకు రెండవశ్రేణి  దర్శనభాగ్యం మాత్రమే కలుగజేయాలి.

– రాయలసీమకు చెందిన  ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తెలంగాణా ప్రజలను దోచుకున్నందువల్ల తెలంగాణా ప్రజలు అన్నమయ్య కీర్తనలకు ఏవిధమైన నష్ట పరిహారం గాని రుసుముగాని చెల్లించనవసరం లేదు. అంతే కాదు, ఇంతకాలం తెలంగాణా ప్రజలను దోచుకున్నందుకు రాయలసీమ వాస్తవ్యులు తిరుపతిలో తెలంగాణా జిల్లాల వారికి ప్రత్యేక దర్శన సదుపాయాలు ఏర్పరచాలి.

– “మా తెలుగు తల్లికి” అన్న గీతం తెలంగాణా జిల్లాలలోని కొన్ని పాటశాలల్లో ఎలానూ నిషేధించారు కనుక, తెలుగుతల్లితో తెలంగాణా వాస్తవ్యులకు పని లేదు. వ్రాసింది శంకరంబాడి కనుక, తెలుగుతల్లి రాయలసీమ వారికి చెందుతుంది. ఆ తల్లిని చూడాలంటే, తీరాంధ్ర ప్రాంతం వాళ్ళు మాత్రం రాయలసీమ ప్రజలకు రుసుం చెల్లించాల్సి వుంటుంది.

– ఇక మీదట రాయలసీమ ప్రజలు, తీరాంధ్ర ప్రజలు తమ అహంకారానికి, తాము చేసే దోపిడీకి పర్యవసానం వుంటుంది అని గుర్తుంచుకొని ప్రవర్తించవలసి వుంటుంది.

జై తెలంగాణా

Signed: Justice Sri Krishna

[ప్రత్యేక తెలంగాణా కోరుకుంటున్న సోదరులకు: అవును, ఇది విపరీతంగా అనిపించవచ్చు. కాని తెలంగాణా పేరుతో కొందరు చెప్పే కొన్ని విషయాలు ఇంతకన్నా విపరీతంగా వున్నాయి. ఈ  ఉన్మాదులు చరిత్ర తిరగ వ్రాస్తున్నారు, అది ప్రజలు నమ్ముతున్నారు.  ఆంధ్ర అనేది బూతుపదం కాదు. అది మనందరి అస్థిత్వం. -Mohan]

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

7 Comments on "కోదండరాం, KCR లకు ఏమి కావాలి?"

  1. Basu, iT(elangana) kannaa IT better kadaa nanna!

  2. @mohan,

    Baaga “Productive time” 🙂 vunnattundi meeku. IT lo panichesthra 🙂 maastaru!
    Take a small walk… Get a life..

  3. Good one.

  4. Basha okkasari chepithe vandhasarlu cheppinattu
    KCR okkasari cheppindhe vandha sarlu repeat chesi prajalni rechcha kodathadu

  5. What about andhra maha bhagavatham written by Sahaja Kavi Pothana? Will it be renamed as telangana maha bhagavatham?

    • మర్చిపోయాను సుమండీ…
      శ్రీనాధుడు తీరాంధ్ర ప్రాంతపు రెడ్డి రాజులను పొగిడాడు. శ్రీనాధుడు, అతని కవితలు తీరాంధ్ర ప్రాంతం వాళ్ళే ఉంచుకోవచ్చు
      పోతన బూతన కాక మరేమిటి? అందుకే “ఆంధ్ర” అనే బూతు పదం భాగవతం ముందు పెట్టాడు. దీనికి ప్రక్షాళనగా ముందుగా శాంతి చేయించి ఆ తర్వాత “ఆంధ్ర మహాభారతం” “తెలంగాణా భాగవతం” గా పునర్నామకరణ చేయబడుతుంది!

  6. Kanaka Byraju | March 20, 2010 at 5:06 PM |

    Srinada Kavi Sarva Bhoumudini marichi poyyaru ee Committee vaallu.

Comments are closed.