ప్రవృత్తికి భావుకుడిని, వృత్తికి అధ్యాపకుడిని అని చెప్పుకొనే నైజం నాది. కొన్ని సరస శృంగార గీతాలు వింటే, వింటూ ఆ గీతాల సునిశత చిత్రీకరణ చూస్తే భావుకత నిండిన రసికత పట్టపగ్గాలు లేకుండా చెలరేగుతుంది. అలాంటి ఒక శృంగార గీతం శ్రీకృష్ణ విజయం లోని “పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు.”
మరొక్కసారి, ఎవరండీ NTR గారికి శృంగార రసం పండించడం రాదు అన్నదీ? ఇంతకంటే సున్నితంగా, మగువల మనసుకు హత్తుకు పోయేలాగా ఏ నటుడు చెయ్యగలడు, చెప్పండి? ఎన్నో సార్లు చూసానీ పాటను నేను. ఈ ఇరువురు ముఖ్యమంత్రుల (NTR , జయలలిత) భేటీ ను మీరుకూడా చూచి తరించండి.. [ఇది అయిదు వీరతాళ్ల పాట]
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతలు దాచిన మనసు, ఒక మాధవునికే తెలుసుసు
ఈ మాధవునికే తెలుసు
సుందరి అందెల పిలుపు, నాడెందము నందొక మెరుపు
నందకిశోరిని మనసు రతనాల బొమ్మకు తెలుసు
ఈ రతనాల బొమ్మకు తెలుసు
వెన్న మీగడలు తిన్నావట,
వెన్నెలలో ఆడుకున్నావట
వెన్న మీగడలు తిన్నావట,
వెన్నెలలో ఆడుకున్నావట
ఎన్నో నేర్చిన వన్నెకాడవట
ఏమందువో మరి నామాట
ఏమందువో మరి.. నా మాట
ఎన్నో నేర్చితినన్నది నిజము
చిన్నారీ…
చిన్నారీ నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన ఆ మాట నిజము
వెన్నుని దోచిన మాట నిజము
సుందరి అందెల పిలుపు నాడెందము నందొక మెరుపు
ఓ ఓ ఓ …పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
ఆహాహా ఆహాహా ఆహా ఆహా ఆహా ఆఆఆ
అందీఅందని అందగాడవని ఎందరో అనగా విన్నాను
అందీఅందని అందగాడవని ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో అవవోకగా కనుగొన్నాను
అలవోకగా కనుగొన్నాను
ఎంత బేలవని అనుకున్నానో, అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నానో, అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును, చెంగున ముడిచిన చెలువవులే
చెలువవులే చెంగలువవులే
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
ఈ మాధవునికే తెలుసు
ఆహాహా హాహా హాహా