పూవై పుట్టి పూవై పెరిగి పూవై రాలి పోనీ అని సాగే ఈ తమిళ పాట వింటుంటే మనసు వూగి పోతుంది. తెలుగు లో రాగ మాలిక అని అనువదించారు. ఈ పాట నచ్చడానికి నాకున్న కారణాలు మూడు.
1. మా మ్యూజిక్ క్లబ్ లో ఈ పాట పాడమని కామేశ్వర రావు మాస్టారు బాగా అనుకరిస్తూ పాడి వినిపించే వారు. పాట వినండి తెలుస్తుంది ఎందుకు వూగిపోవాల్సి వస్తుందో. విపరీతమైన గమకాలు మరి.
2. ఇళయరాజా
3. బాల సుబ్రహ్మణ్యం
విని వీర తాళ్ళు వెయ్యండి !