సడి సేయకో గాలి సడి సేయబోకే.
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
రాజ మకుటం లోని ఈ పాట చిత్రీకరణ నాకు నచ్చలేదు. డైరెక్టర్ భావభంగం చేసారు అనిపిస్తుంది. విలన్ పాత్ర కనిపించకుండా వుంటే పర్లేదేమో.
ఈ పాటంటే నాకిష్టమని ఎన్నోసార్లు నేను చెప్పాను. అంతే కాదు ఈ పాటంటే తమకు ఇష్టం అని ఎంతో మంది మగరాయళ్ళు కూడా చెప్పారు. ఎందుకని ఆలోచిస్తే నాకు అనిపించిన విషయాన్ని నా సొంత పైత్యంగా జత చేసి ఈ దేవులపల్లి విరచిత, మాస్టర్ వేణు స్వరకల్పిత, లీల ఆలాపిత గీతాన్ని మీకందిస్తున్నాను. వినండి.
Podcast: Play in new window | Download (Duration: 5:24 — 3.7MB) | Embed
Subscribe: RSS