Nothing But Wind…

ఇళయరాజాకున్న శతకోటి అభిమానులలో నేనొకడిని. శ్రీను దగ్గర ఇళయరాజా పాటల collection  వినడం, వివిధ భారతి లో వచ్చే తమిళ పాటలు వినడం వాళ్ళ ఇంకా అభిమానం పెరిగింది. ఆ నమయంలో మా మ్యూజిక్ క్లబ్ కి, నా దృష్టికి వచ్చిన మ్యూజిక్ album , Nothing  But  Wind . నేను, శ్రీను ఎన్ని సార్లు విన్నామో తెలీదు. 3rd year  అనుకుంట, R .E .C  వరంగల్ లో జరిగే Annual Festival , Spring  Spree లో participate  చెయ్యమని పిలుపు వచ్చింది. మా కామేశ్వరరావు మాస్టారు ప్రోద్బలం తో మొదలుపెట్టాము మెదడుకు పని. మా క్లబ్ సంగీత రూపకం లో పోటి చేద్దాం అని decision తెసుకోన్నాం.

కధ: చక్కగా, సంతోషంగా వున్నా ఒక రైతు కుటుంబంలో ‘సారాయి’ అనే భూతం వచ్చి కుటుంబాన్ని నాశనం చేస్తుంది. భార్య, కుమార్తె ఎంత ప్రయత్నించినా ఫలితం వుండదు. చివరకు మహిళా శక్తి తో ఆ భూతాన్ని తరిమి కొడతారు.

Nothing  But  Wind : The basic idea you get when you listen to this composition is as follows: The world started with just nature, birds, clean and slowly started to get polluted and if this continues, the wold will get destroyed. Finally, only thing left is ‘Nothing But Wind’.

[media id=18 width=480 height=20]

Link for smart phones.

మొదట మ్యూజిక్ ప్రశాంతంగా మొదలవుతుంది, అప్పుడు సంతోషంగా ఆడుతూ పాడుతూ వుండే రైతు కుటుంబం కనిపిస్తుంది. పాటలో ఎప్పుడైతే distructive change  మొదలవుతుందో అప్పుడు రైతు మద్యం కి అలవాటు పడటం మొదలుపెడుతాడు. ఇక్కడ మా సీనియర్, Magic సతీష్, సారాయి దెయ్యంలా వచ్చి చిన్న చిన్న ట్రిక్కులు చేసి, రైతుని ఆకర్షించి, సారాయికి అలవాటు చేస్తాడు. పాట మద్యలో డాన్స్ లాంటి మ్యూజిక్ వస్తుంది. అప్పుడు ఆడవాళ్ళని ఏడిపించడం లాంటి కోతి పనులు చేస్తాడు. మద్యలో వేదమంత్రాలు వస్తాయి, అప్పుడు మన రైతు భార్య పూజారిని పిలిచి పూజలు చేసేట్టు మార్చాం. సాంగ్ చివరకు వచ్చేటప్పటికి భయంకరమైన అరుపులు వస్తాయి, అప్పుడు మన రైతు సారాయి వల్ల ఆరోగ్యం పాడై అరుస్తున్నట్టు చేసాం. రైతు చనిపోయే పరిస్తితి వస్తుంది, భార్య, కూతురు ఏడుస్తుంటారు, వెనక దెయ్యం  నవ్వుతుంటుంది, అప్పుడు రుద్రతాండవం లాంటి చిన్న బిట్ వస్తుంది. ఈ బిట్ ని మేమే Nothing  but  Wind  చివర అతికించాము  అప్పుడు మా జూనియర్ ఒక అమ్మాయి దుర్గాదేవి లాగా వచ్చి నాట్యం చేసి, శూలం తో దయ్యాన్ని పొడిచి చంపుతుంది. అంటే, మహిళాశక్తి అన్నమాట. ఇంకేంటి, అంతా బాగైపోతుంది. ఈ పాట చిన్న ఢమరుకం లాంటి చప్పుడుతో ముగుస్తుంది. దాన్ని మేము సారాయి సీసా దోల్లిపోతున్నట్టు చూపించాం.

That was 1994 and our team won first place for this and our collage is the overall champions for 1994.