Sudharaagam Mini serial Episode -11

vikram meena sudha ని ఇంట్లో drop చేస్తాడు . Sudha ఏడుస్తూ రావడం చూసి వాళ్ళమ్మ కంగారు పడుతుంది .Meena జరిగిన విషయమంతా చెప్తుంది వాళ్ళమ్మ తో . ఇది abhi ని ఇష్టపడుతుందా …వాడు ఇంకో అమ్మాయిని ఇష్టపడితే మరి ఇపుడు ఇదేంటి …అయిన మంచి friends కదా అని మిమ్మలిని వదిలేస్తే ఇలాంటి పనులా చేసేది అని అరుస్తుంది వాళ్ళమ్మ .అయిందేదో అయింది ఇంకా ఇలాంటి వెధవ వేషాలు మాని బుద్ధి గా చదువుకోండి అంటుంది . Sorry aunty అని meena వెళ్ళిపోతుంది .Sudha వాళ్ళమ్మ ని పట్టుకుని sorry అమ్మ కాని abhi ఇలా చేస్తాడనుకోలేదు అని ఏడుస్తుంది .సరే నాన్న గారు వచ్చే time అయింది నువ్వు calm గా పడుకో ఇవాల్టితో ఈ విషయం వదిలేయి అంటుంది .

చాలా సేపు అలానే ఉంది రాత్రి 11 గంటలకు అక్కడి నుండి బయల్దేరతారు jay abhi. Jay abhi తో అది నిజంగా నిన్ను ఇష్టపడింది రా ఇపుడిలా ఎందుకు చేసిందో అర్ధం కావట్లేదు meena కూడా phone ఎతట్లేదు చేస్తే అంటాడు . Abhi car నడపలేనంటాడు …jay కి driving అంతగా రాదు …driving వచ్చిన ఒక waiter ని తీస్కుని ఇంటికి వచ్చి మళ్ళీ వాడిని auto లో పంపిచేస్తారు.
Abhi తన గది లోకి వచ్చి గట్టిగా ఎడ్చేస్తాడు దుఖం ఆపుకోలేక . అప్పటికి వాళ్ళమ్మ నాన్న పడుకుని ఉంటారు .

తెల్లవారి sudha పొద్దున్న లేచి tiffin చేసి మళ్ళీ పడుకుంటుంది .Abhi ఇంకా levadu . Abhi వాళ్ళమ్మ తనకి మంచి friend కావడం తో phone చేసి జరిగిందంతా చెప్తుంది sudha వాళ్ళమ్మ . ఇద్దరు వాళ్ళ ఆయనలతో కూడా చెప్తారు .ఇద్దరు నిజంగా ఇష్టపడితే మనకేం problem లేదు కాని ఇంకా ఇలా అయిన తర్వాత మనమేం చేస్తాం …ఐనా abhi కి బుద్ధి చెప్పాలి …వాడిలా ఎందుకు చేసాడో అంటారు abhi వాళ్ళ నాన్న గారు .

Jay వాళ్ళ నానమ్మ కి serious గా ఉందని phone రావడం తో పొద్దున్నే ఊరేల్లిపోతారు jay వాళ్ళ family. Meena కి కూడా చాలా కోపంగా ఉంటుంది abhi పైన .Abhi వాళ్ళ parents abhi ని అడుగుతారు …ఎందుకు చేసావిలా అని …నేను ప్రేమించింది sudha నే అమ్మ ..ఇంకెవరికో నేను propose చేయడం నాక్కూడా అయోమయం గా ఉంది అంటాడు abhi. సరే ఏదయితే అయింది ఇంకా sudha ని disturb చేయకు అంటారు abhi parents.

Abhi బయటికి ఎటు వెళ్ళాక ఇంట్లోనే ఉంటాడు …meena phone కి try చేస్తే lift చేయదు ……College మొదలవుతుంది …meena sudha college కి వెళ్ళడం రావడం కొత్త books పని లో ఉంటారు . Abhi ఒకటి రెండు సార్లు కలవాలని ప్రయత్నించినా కలవనివ్వరు . Abhi college start ఐనా వెళ్ళాలి అనిపించక ఇంట్లోనే ఉంటాడు . Sudha జరిగింది తల్చుకుని ఇంకా ఏడుస్తూనే ఉంటుంది .

ఆ రోజు మధ్యాహ్నం jay ఊరి నుండి వస్తాడు ….abhi ఇంట్లోనే ఉన్నాడని తెలిసి వెళ్లి పలకరిస్తాడు ..వాళ్ళిద్దరూ తనతో అసలు మాట్లాడట్లేదు అని చెప్తాడు .Jay సాయంత్రం వాళ్ళతో మాట్లాడతా నేను అని చెప్తాడు jay.