DesiInUSA

Desi Trump Voters Regret & ‘Open-Border Policy’ Myth. ట్రంప్‌కు ఓటేసిన దేశీలు.. మొదలైన పశ్చాత్తాపం!

2024 ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసిన నా పరిచయస్తులు ఇద్దరితో నేను జరిపిన సంభాషణలను ఈ వీడియోలో పంచుకున్నాను. వారిలో ఒకరు నా పాత విద్యార్థి కాగా, మరొకరు నాతో కలిసి పనిచేసిన ఒక నిపుణుడు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే అయినప్పటికీ, అక్రమ వలసలు మరియు "ఓపెన్ బోర్డర్" ప్రచారపు మాయలో పడి ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. ఎంతటి విద్యావంతులైనా రాజకీయ ప్రచారాల ఉచ్చులో ఎలా చిక్కుకుంటారు, ఆ సమయంలో తమ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకున్నారు, ఆ తర్వాత […]


The Cost of Staying Quiet: Learn to Communicate Better & Assert. మనవాళ్లకు మాట్లాడటం చేతకాదా?

అమెరికాలో అనుకోని వివాదాలు లేదా బహిరంగ ఘర్షణలు ఎదురైనప్పుడు మన కమ్యూనిటీ ప్రజలు ఎందుకు సరైన రీతిలో స్పందించలేకపోతున్నారు? ఈ ఎపిసోడ్‌లో రెండు వైరల్ వీడియోల ద్వారా మన సంభాషణా లోపాలను లోతుగా విశ్లేషిస్తున్నాం. బోర్డర్ పెట్రోల్ ఎదుట ఓ డ్రైవర్ తన హక్కులను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎలా కాపాడుకున్నాడు, అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో టో-ట్రక్ డ్రైవర్‌తో వాగ్వాదంలో మనవాళ్లు ఎందుకు తడబడ్డారు అనే విషయాలను పరిశీలించాం. అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ, దూకుడుగా ఉండే పరిస్థితులను […]


Influencers: The Root Causes of Anti-Hindu Hate? చికాగో హిందూ టెంపుల్ దాడి కుట్రకు మూల కారణాలు ఏంటి?

ఈ వీడియోలో, ఇల్లినాయిస్ లోని అరోరాలో ఉన్న ఒక హిందూ దేవాలయంపై దాడి చేసి వీలైనంత మంది హిందువులను చంపాలని కుట్ర పన్నిన 19 ఏళ్ల వైట్ సుప్రీమసిస్ట్ అరెస్ట్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలను విశ్లేషిస్తున్నాను. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడి మెదడులో భారతీయులు, హిందువుల పట్ల ఇంతటి ద్వేషం ఎలా నాటుకుంది? సారా గొంజాలెస్, సవన్నా హెర్నాండెజ్ లాంటి వారు సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న జాతి వివక్షత, హిందూ వ్యతిరేక విషప్రచారమే […]


Nobel Snub, A Blitz of Rallies & Protest. ఎన్నికలకు 3 వారాలు: సెనేట్ డిబేట్స్ & తాజా పరిణామాలు

You are welcome to go through the show notes:Join the conversation (will take calls after first 90 minutes):Just three weeks from the midterms, the political landscape is shifting fast. Today, we break down Trump’s fiery reaction to the Nobel Peace Prize, a controversial US-Russia diesel deal, and the Pentagon's unprecedented plan to livestream a military […]


F1→OPT→H1B→GC→Citizen: Still Support this Guy/GOP? $70,000 OPT ఫీజు.. మనవాళ్ల స్వార్థంపై నా ప్రశ్న!

అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పని చేసుకోవడానికి ఉపయోగపడే OPT (Optional Practical Training) పై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $70,000 భారీ ఫీజును, రిన్యూవల్ కోసం మరో $30,000 జరిమానాను ప్రతిపాదించింది. నాడు F-1 ➡️ OPT ➡️ H-1B ➡️ గ్రీన్ కార్డ్ ➡️ సిటిజన్‌షిప్ దారిలో కష్టపడి అమెరికా గడ్డపై అడుగుపెట్టి, ఈరోజు లీగల్‌గా సెటిల్ అయిన కొందరు ఇండియన్-అమెరికన్లు ఇప్పుడు ఈ అన్యాయమైన రూల్స్‌ను, ట్రంప్ సర్కార్ చర్యలను ఎలా సమర్థిస్తున్నారు? వారిని […]


Football, Culture & Xenophobia: టెక్సాస్ కాలేజ్ ఫుట్‌బాల్‌లో ఇండియన్ పిల్లలపై అక్కసు!

అమెరికాలో ఎంత కలిసిపోయినా మనల్ని ఇంకా పరాయివాళ్లలాగే చూస్తున్నారా? యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ (UT Longhorns) కాలేజ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, పెద్ద దుమారానికి దారితీసింది. అమెరికన్ కల్చర్‌ను, స్పోర్ట్స్‌ను సొంతం చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నా… విద్వేషపూరిత ట్రోలింగ్ ఎందుకు జరిగింది? కాలేజ్ స్పోర్ట్స్ కల్చర్, ఇమ్మిగ్రెంట్ గుర్తింపు, మరియు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వీడియోలో… సమగ్రంగా.. విశ్లేషిస్తున్నా! […]


We are Proud Americans. We Earned it. మాకు పౌరసత్వం అప్పనంగా రాలేదు.

ఈ ఎపిసోడ్‌లో, ఒక ప్యానెల్ చర్చ. ఇందులో నేను, కిరణ్, గంగాధర్ కలిసి ఇండియన్-అమెరికన్లుగా మా ప్రయాణాలను గుర్తు చేసుకున్నాము. అమెరికా ప్రజాస్వామ్యంలోని 250 ఏళ్ల చరిత్రను కాకతీయ, మొఘల్ సామ్రాజ్యాలతో పోల్చుతూ చర్చించాము. పౌరసత్వం కోసం నేను పడ్డ 16 ఏళ్ల కష్టాన్ని పంచుకోవడంతో పాటు, ఇమ్మిగ్రెంట్ గుర్తింపుపై జోహ్రాన్ మందాని చేసిన ప్రసంగంపై మా అభిప్రాయాలను వ్యక్తం చేశాము. దశాబ్దాల పాటు ఇక్కడ కష్టపడి, పన్నులు కట్టి, ఈ సమాజంలో భాగమైన మనం… ఈ […]


The Costco Fix: The Desi Weekend Pilgrimage! అమెరికాలో మనోళ్ల కొత్త పుణ్యక్షేత్రం కాస్ట్‌కోనేనా?

అమెరికాలో ఉన్న మన దేశీయులందరికీ కాస్ట్‌కో ఎందుకు ఇంతగా ఇష్టమైన స్టోర్? ఈ ప్రత్యేక గ్రూప్ డిస్కషన్‌లో, మేమంతా కలిసి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాం: 'కొందరు గుడికి వెళ్లడం మానేసినా కాస్ట్‌కోకి వెళ్లడం మానరు అని నిజమా?' మా వ్యక్తిగత షాపింగ్ అనుభవాలు మరియు భారీ కొనుగోలు (bulk hauls) పంచుకుంటూ, కాస్ట్‌కో మనందరికీ ఎంతలా అలవాటుగా మారిందో చర్చించాం. బల్క్ వంట సామాను దగ్గర్నుంచి, నెయ్యి, సీజనల్ మామిడి పండ్ల వరకు… కాస్ట్‌కో మన […]