తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుది మొదటి నుంచీ విచిత్రమైన స్టైలే. ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రకటనలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి తెలంగాణ ఏర్పాటుపై తనకు అత్యంత రహస్యమైన సమాచారం అందిందని ఒకసారి, సోనియా ఏమనుకుంటున్నారో తనకు తెలిసిపోయిందని మరోసారి సంచలనాత్మక రీతిలో ప్రకటనలు గుప్పించారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం చప్పబడినప్పుడల్లా మాటల తూటాలు పేల్చి అగ్గి రగలచ్చడంలో కూడా కేసీఆర్ కు సాటి మరెవరూ రారు. అలాగే, ఉన్నట్టుండి మౌనముద్రదాల్చడంలో కూడా కేసీఆర్ సిద్ధహస్తుడే. అంతేనా అంటే, ఇంకా చాలా ఉంది. చండీయాగాలు చేయడం, నేటి పాలకులకంటే నాటి నిజాం పాలనే మెరుగంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం, చార్మినార్, గోల్కొండ కోట మొదలుకుని చారిత్రిక కట్టడాలు తెలంగాణ సొంతమంటూ మాట్లాడటం కేసీఆర్ కు తప్ప మరే నాయకుడి వల్ల కాదనే చెప్పాలి.
విలక్షణ నేతగా పేరుతెచ్చుకున్న కేసీఆర్ ఉన్నట్టుండి ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. ఈ తాజా పరిస్థితిపై తెరాస నేతలే వ్యాఖ్యానిస్తూ, కేసీఆర్ గోడకు తగిలించిన తుపాకీ లాంటి వారు….అవసరమైనప్పుడు అందులోనుంచి గుళ్లు దూసుకువస్తాయంటూ చెప్పడంతో అసలు కేసీఆర్ కు ఏమైందన్న అనుమానాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారనీ, ఈ కారణంగానే ఆయన బయటకు తరచుగా రావడంలేదంటూ రూమర్స్ వచ్చేశాయి. ఇంకో రూమర్ మరో మెట్టు పైకెక్కేసింది. ఆయన ఏడాది కంటే ఎక్కువ బతికే అవకాశాలు లేవన్నది ఈ రూమర్ సారాశం. అయితే, ఇవన్నీ దుష్ప్రచారం సాగుతోంది. `అబ్బే తనకు ఎలాంటి జబ్బు లేదు, ఎవరో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు, అంతే…’ అంటూ కేసీఆర్ దబాయిస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదనీ, ఈ మధ్య కేసీఆర్ మౌనంగా ఉండటానికీ ఆయన అనారోగ్య పరిస్థితులే కారణమంటూ కొంతమంది గట్టిగానే వాదిస్తున్నారు. ఒక వేళ ఆయన ఆరోగ్యంగానే ఉంటూ మౌనంగా ఉన్నారంటే, కచ్చితంగా ఢీల్లీ నుంచి ఆయనకు పెద్ద మొత్తం ఫేవర్ జరిగే ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆనోటా, ఈనోటా జరిగే ప్రచారమే తప్ప వాస్తవాలపై సరిగా ఉప్పందడంలేదు. ప్రస్తుతానికి రూమర్స్ మాత్రం షికారు చేస్తున్నాయి.
KCR povudantu jaruguthe adhi CBN poyinatharuvathe…l KCR bathiki vunnadhe CBN ni fry chesukoni thinadaniki…l CBN poyaka okka 1 sec tharuvatha KCR pothadu patidhaka poodu…l Kallu musina, Kallu therichina KCR ki CBN thappa evaru kanipincharu…l
KCR vadu vani chetha politics… I just hate him like anything…l