అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు ఇటీవల టర్కీ పర్యటనకు వెళ్లారు. వెళ్లేటప్పుడు ఖతార్ దేశం వారు బహుమతిగా ఇచ్చిన 400 మిలియన్ డాలర్ల విలాసవంతమైన బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌లో దర్జాగా వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో అసలు కథ మొదలైంది! ఆ ఖతారీ జెట్‌కు భద్రతా ముప్పు ఉందని భావించిన సీక్రెట్ సర్వీస్ వారు ట్రంప్ గారిని పాత రెగ్యులర్ ఎయిర్ ఫోర్స్ వన్‌కి తరలించారని మనమంతా వార్తల్లో చూశాం. కానీ తెర వెనుక జరిగింది వేరు.
ట్రంప్ గారు వాస్తవానికి రెండుసార్లు విమానం మారారు! ఖతారీ జెట్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్‌కి, ఆ తర్వాత అక్కడి నుంచి అత్యంత రహస్యంగా ఒక మిలిటరీ జెట్‌కి మారారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన్ని ఒక క్యాటరింగ్ ట్రక్కులో దాచి తరలించినట్లు సమాచారం.
ఇంతకీ అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఇరాన్ నుంచి భద్రతా ముప్పు ఉందన్న విషయం తెలిసీ, తన క్యాబినెట్ మంత్రులను, వైట్ హౌస్ సిబ్బందిని, ప్రెస్ వాళ్లను మాత్రం ఆ రెగ్యులర్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే వెనక్కి పంపించారు. అంటే, వాళ్లు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళని ఎరగా వేసి తాను మాత్రం సైలెంట్ గా వేరే విమానంలో ఉడాయించారు. తనను తాను వీరుడు, సూరుడు, ధీరుడు, 'ఆల్ఫా మేల్' అని చెప్పుకునే ఆయన అసలు స్వరూపం ఇది. ఇతరుల ప్రాణాలు పోయినా తనకు అనవసరం, తాను క్షేమంగా ఉంటే చాలు అన్నట్లుంది ఆయన తీరు. 'శ్రెక్' సినిమాలో లార్డ్ ఫక్వాడ్ (Lord Farquaad) అనే విలన్ "Some of you may die, but it's a sacrifice I am willing to make" అన్నట్లుగా ఉంది వ్యవహారం.
ఈ విచిత్రమైన ఉదంతంపై సెటైరికల్‌గా నేను చేసిన ఈ వీడియో చిత్తగించండి. ఇదొక ఆధునిక బుర్రకథ అనుకోండి. మీకు బుర్ర తిరిగే ఈ బుర్రకథ నచ్చుతుందని ఆశిస్తున్నాను!
US President Trump recently visited Turkey, traveling in a lavish $400 million Boeing 747 gifted to him by Qatar. However, the return trip was a completely different story. Deeming the Qatari jet a security risk, the Secret Service intervened. We all saw the initial reports of him being ushered onto the traditional Air Force One, but the real story is much wilder.
Trump actually switched planes twice. From the Qatari jet, he moved to Air Force One, and then from Air Force One, he was secretly transferred to a military jet—allegedly being smuggled across the tarmac in a catering truck!
Meanwhile, he sent his cabinet ministers, White House staff, and the press corps back on the regular Air Force One, leaving them fully exposed to a known security threat from Iran. Essentially, he used his own people as bait so he could quietly escape in a separate plane. For a man who constantly projects himself as a hero, a warrior, and an "alpha male," this reveals his true colors. It perfectly mirrors the villain Lord Farquaad from Shrek, who famously said, "Some of you may die, but it's a sacrifice I am willing to make."
In this video, I present a tongue-in-cheek, satirical breakdown of this cowardly escape. Think of it as a modern, mind-boggling Burrakatha (traditional storytelling) that I put together to expose the absurdity of it all. Enjoy!
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#TrumpEscape #AlphaMaleMyth #AirForceOne #QatarJet #LordFarquaad #PoliticalSatire #SecretService #MohanReacts #Burrakatha #USPolitics #CowardInChief
Be the first to comment on "The Great Escape: క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ పరారీ!"