ఒక సంవత్సరం క్రితం, నవంబర్ 24, 2024 న వీడియో రూపంలో వచ్చిన నా ఈ బహిరంగ లేఖ కేవలం గొణుగుడు లా ఉండేది, ఇప్పటివరకు కేవలం 400 మంది మాత్రమే చూశారు. కానీ, ఇప్పుడు జరిగింది చూశాక, ఇది తప్పక వినిపించాల్సిన అరుపు! శ్రీశ్రీ పరిభాషలో వెర్రిగొంతుకతో నీ వేసిన కేక.
నాటి నా అసలైన, చాలా సూటిగా, ఆవేశంగా ఉన్న ఓపెన్ లెటర్‌ని మళ్ళీ విడుదల చేస్తున్నాను. అప్పుడు, ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నప్పుడు, నేను ఈ విజ్ఞప్తి చేశాను. నేను ప్రత్యేకంగా అభ్యర్థి చేసిన పనులన్నింటినీ, మాటలన్నింటినీ—ప్రతి హెచ్చరికను—ఒక జాబితాగా చెప్పి, వాళ్ళు విస్మరించడానికి ఎంచుకున్న ఒక్క ప్రశ్ననే అడిగాను: మీరు ఆయనకే ఎందుకు ఓటు వేశారు?
నా సందేశం రెండు విధాలుగా ఉంది: మీ విజయాన్ని ఆస్వాదించండి, కానీ ఆయనకు ఓటు వేయని వారి పట్ల ఉదారం గా ఉండండి, వారిని రెచ్చగొట్టకండి.ఇప్పుడు, నేను ఆనాడు చెప్పిన భవిష్యత్తు ఎంత నిజమో తేలిపోయింది. నేను ఇచ్చిన హెచ్చరికలు, నేను చెప్పిన వాస్తవాలు—అవే మనం ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు.