April 18, 2011 – Tax Day!
నేను సైతం ప్రజల సొమ్ముపై “వాలు” స్ట్రీటుకు
వేల వేలు ముడుపులిచ్చాను
నేను సైతం పన్ను కట్టని కార్పోరేట్లను
వెన్నుతట్టి భేషు అన్నాను
నేనుసైతం ఈనాడే అమెరికాలో
టాక్సు కట్టి వెక్సు అయ్యాను
Here is another verse:
పరాన్న భుక్కులారా, సిగ్గులేకుండా చిరకాలం వర్ధిల్లండి.
—————————————————————-
పన్ను కట్టని సంపన్నులు –
పన్ను ఎగదన్ను వ్యాపార సంస్థలు-
ఎగదన్నువారికి పన్నులెక్కువనే తొత్తువేత్తలు –
సామాన్యుల తన్నుకొమ్మని ఉద్యమించే కహూన నేతలు-
పన్ను సొమ్ముల, దాచు డబ్బుల దొంగిలించే చోర బ్యాంకులు-
అందుకోండి ఈ పరాకు ప్రజల బహు పరాకులు
—
Clarification on తొత్తువేత్తలు (తత్వ వేత్తలు కాదు, తొత్తువేత్తలే. అంటే “pseudo intellectuals” a.k.a. ‘think tank’ pundits అన్న మాట)