Telugu

Do Democrats Have a Far-Left problem? డెమోక్రాటిక్ పార్టీలో ఫార్-లెఫ్ట్ v. మోడరేట్స్ – ప్రత్యేక చర్చ

డెమోక్రాటిక్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత విభేదాలపై ఈ ప్యానెల్ చర్చ సాగింది. ముఖ్యంగా 'మోడరేట్' నాయకులు మరియు 'ఫార్-లెఫ్ట్' ప్రోగ్రెసివ్ వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం పార్టీని ఏ దిశగా తీసుకెళ్తోంది? న్యూజెర్సీ ప్రైమరీలో టామ్ మలినోవ్స్కీ మరియు అనలీలియా మెజియా మధ్య జరిగిన పోటీని ఉదాహరణగా తీసుకుని ఈ విశ్లేషణ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ సహాయంపై తీసుకున్న నిర్ణయాలు, మరియు ఆ నేపథ్యంలో AIPAC వంటి సంస్థల జోక్యం ఎన్నికల ఫలితాలను ఎలా మార్చివేసాయో […]


Grassroots Strategy. Polymarket Flips Senate Odds. ఇజ్రాయెల్, ఇరాన్, & అమెరికా ఎన్నికలు: మా విశ్లేషణ

నా లైవ్ షో *అన్నా, ఇది అమెరికా* లోని ఈ ప్రత్యేక వీడియోలో, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలను మరియు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలను మేము లోతుగా విశ్లేషించాము. ఈ రాజకీయ ప్రకటనల సమయంలో స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న ఆకస్మిక మార్పులు, మానిప్యులేషన్స్ పై పలు అనుమానాలను వ్యక్తం చేశాము. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న వాస్తవాలను నేను వివరిస్తుండగా, కిరణ్ ఇరాన్ నెగోషియేషన్స్ పై తనదైన కోణాన్ని పంచుకున్నారు. అలాగే, […]


“Trump is a Madman” Theory. ట్రంపిజాన్ని అంతం చేయడానికి ‘ప్రాజెక్ట్ 29’!డెమోక్రాట్ల ముందున్న సవాల్!

నా లైవ్ షో అన్నా, ఇది అమెరికా లోని ఈ సెగ్మెంట్‌లో, నేను పామ్ బాండీ సబ్ పీనా వివాదం వెనుక ఉన్న చట్టపరమైన లొసుగులను మరియు డొనాల్డ్ ట్రంప్ వింత ప్రవర్తనను తీవ్రంగా విశ్లేషించాను. కేవలం ఒక గంటలో ట్రంప్ చేసిన 47 ట్వీట్ల వెనుక ఉన్న "మ్యాడ్ మ్యాన్ థియరీ" (Madman Theory) ని, దాని ద్వారా స్టాక్ మార్కెట్ ను ఆయన ఎలా ప్రభావితం చేస్తున్నాడో నేను స్పష్టంగా వివరించాను. నాతో పాటు […]


The $20 Billion Iran Deal. Who’s Controlling Hormuz? ట్రంప్ మాటల గారడీ.. స్టాక్ మార్కెట్ అనుమానాలు

మా లైవ్ షో *అన్నా, ఇది అమెరికా* లోని ఈ ప్రత్యేక వీడియోలో, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలను మరియు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలను మా ప్యానెల్ లోతుగా విశ్లేషించింది. ఈ రాజకీయ ప్రకటనల సమయంలో స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న ఆకస్మిక మార్పులు, మానిప్యులేషన్స్ పై మేము పలు అనుమానాలను వ్యక్తం చేశాము. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న వాస్తవాలను నేను వివరిస్తుండగా, కిరణ్ ఇరాన్ నెగోషియేషన్స్ పై తనదైన కోణాన్ని […]


Trump’s “India is a ‘Hellhole'” Screed: ట్రంప్ సుదీర్ఘ నస వెనుక సుప్రీం కోర్టు భయం!

ఇండియన్ మీడియా, నాయకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రవాస భారతీయుల్లో వస్తున్న తీవ్ర ఆగ్రహం గురించి నేను విశ్లేషించాను. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, మైఖేల్ సావేజ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఒక ట్రాన్స్క్రిప్ట్ ని ట్వీట్ చేశాడు. అందులో ఇండియాను ఒక "హెల్ హోల్" (నరకం లాంటిది) అని దారుణంగా వర్ణించారు. ఆ ట్వీట్ ని షేర్ చేయడం ద్వారా ట్రంప్ కూడా ఆ మాటలని సమర్థించినట్లు స్పష్టమవుతోంది. కానీ ఈ విషయంపై నా విశ్లేషణ […]


రానున్న ట్రంప్ పాలన గురించి ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా?

అన్నా, ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళి తో PILOT SHOW. తెలుగులో. యూట్యూబ్ లో. YouTube. https://www.youtube.com/@mohanamurali-v జనవరి 10, 2025. శుక్రవారం. 10 AM US EST. (8:30 PM IST) ముఖ్యఅతిథి: ప్రొఫెసర్ వెంకటరావు మూల్పూరి. టాపిక్: రానున్న ట్రంప్ పాలన లో అమెరికాలో ఉన్నత విద్య. ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా? ఈ షో ఎలా ఉండబోతుందో కొంచెం రుచి చూడాలంటే, ఈ ఇరువురు ప్రొఫెసర్లు, (మోహన మురళి, మూల్పూరి) 2010 లో నిర్వహించిన ఈ లైవ్ […]


కవనాల తెలుగుజాతి

కవనాల తెలుగుజాతి కన్యాశుల్కం తో ఊళ్లు తిరిగి వెతికి పట్టేవారు బంధుత్వాలు ముక్కు మొఖాలే కాదు తాత ముత్తాతల చిరునామాలతో సహా… పసిమొగ్గల్ని వడలిన  తోటకూరతో జత కడితే …. సామజిక విలువలు వల్లకాటికి పోతున్నాయని గగ్గోలు ఎత్తారు కందుకూరి సామాజిక విలువల్ని వల్లకాటి నుండి లాక్కువచ్చే ప్రయత్నం లో వచ్చాయి వర విక్రయాలు, వరకట్నాల రూపంలో….. ఏమి కోల్పోయాము? ఏమి కోల్పోతున్నాము? కన్యాశుల్కం, వరకట్నం ఏది కావాలో ఏదీ కాక మరింకేదైనా కావాలో! వెదుకులాట, పితకలాట […]


మేఘమా దేహమా …

సృజనాత్మకత మోతాదుకు మించి వున్న తెలుగు చలన చిత్ర దర్శకుడు వంశి. ఈ మద్య వీరు తీసిన సినిమాలలోని పాటల వెనక కథల మీద మా టీవీ ఒక కార్యక్రమం చేసింది. అందులో వంశి గారి మొదటి సినిమా మంచు పల్లకి లోని మేఘమా దేహమా అనీ పాట ఎలా పెట్టాడు అని చెప్పాడు. మనం విన్న తెలుగు పాట మాతృక ఒక తమిళ పాట. ఆ తమిళ పాటకి మాతృక ప్రముఖ ఘజల్ గాయకుడు స్వర్గీయ జగ్జిత్ […]


అంతర్జాల మామ, చందమామ !

చందమామ అంటే తెలియని తెలుగోడు వుండడు. ప్రతి ఒక్కరి బాల్యం ఈ మహాద్భుతమైన సరళ సంచిక తో ముడిపడి వుంటుంది. అందులో నేను ఒకడిని. చిన్నప్పుడు ఎప్పుడు చందమామ వస్తుందా, గ్రంధాలయం కెళ్ళి చదవాలా అని తొందరగా వుండేది. ఈ సాగర మధనం లో పడి నా బుడి బుడి ఆలోచనలు మర్చి పోయాను. మళ్ళి ఇదిగో ఈ అంతర్జాల మహిమ వల్ల  www.chandamama.com  రూపంలో సాక్షాత్కరించింది. 1947 జూలై అంటే మనకు స్వాతంత్రం రాక మునుపు విడుదల అయిన […]


తెలుగు గ్రంధాలు కొనాలనుకుంటే…

Came across this website a few weeks back when searching for Telugu novels. I was really excited about this portal as I always wanted to own Telugu books of my own. I wanted to share with information on Teluglobe but decided to buy first and ordered 3 books of Yandamuri. They charged me $12 and took about 3 weeks […]