నరకం నుంచి ఎప్స్టీన్ పంపిన ఇమెయిల్ బాంబులు. పేలిన ట్రంప్ సౌధం

హౌస్ ఓవర్సైట్ కమిటీ విడుదల చేసిన 20,000 పైగా జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ డాక్యుమెంట్లు (డెమొక్రాట్‌లు, రిపబ్లికన్‌లు ఎంపిక చేసిన ఈమెయిల్స్‌తో సహా) ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కి తన లైంగిక దురాచార కార్యకలాపాల గురించి తాను ఒప్పుకున్న దానికంటే ఎక్కువే తెలుసు అని ఎప్స్టీన్ నమ్మాడని సూచిస్తున్నాయి. ఇది వార్తల్లో ప్రధానాంశంగా మారింది.

ట్రంప్ మాత్రం ఎప్స్టీన్ సెక్స్-ట్రాఫికింగ్ ఆపరేషన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీని గురించి తనకు తెలియదని ఖరాఖండిగా ఖండించారు. ఈ విడుదల అంతా ఒక “తప్పుడు కథనం” (hoax) మరియు “స్పష్టమైన దృష్టి మరలింపు” (clear distraction) అని ఆయన అభివర్ణించారు.

I. ట్రంప్ కు అంతా తెలుసు, వ్యక్తిత్వంపై ఎప్స్టీన్ ఆరోపణలు

ఎప్స్టీన్ పంపిన ఈమెయిల్స్‌లో ట్రంప్‌పై నేరుగా ఆరోపణలు, హేళన చేసే అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి, ట్రంప్ ఒప్పుకున్నదాని కంటే వారి మధ్య సన్నిహిత సంబంధం ఉందని, ఎప్స్టీన్ అతన్ని చులకనగా చూసేవాడని సూచిస్తున్నాయి:

  • తెలుసుననే వాదన (జనవరి 2019): ట్రంప్‌కి “అఫ్కోర్సు ఆ అమ్మాయిల గురించి ట్రంప్ కు తెలుసు” మరియు అతను ఘిస్లైన్ మ్యాక్స్‌వెల్‌ని “ఆపమని అడిగాడు” అని ఎప్స్టీన్ స్పష్టంగా చెప్పాడు.
  • అరవని కుక్క” (ఏప్రిల్ 2011): ఎప్స్టీన్, మ్యాక్స్‌వెల్‌కి రాస్తూ, “ఆ అరవని కుక్క ట్రంప్ అని నువ్వు గుర్తించాలి” అన్నాడు. “[రిడాక్టెడ్] నా ఇంట్లో ఆయనతో గంటలు గడిపింది, ఆమె పేరు ఒక్కసారి కూడా ఎప్పుడూ రాలేదు” అని చెప్పాడు.
  • “మురికి” వ్యాపారవేత్త (ఆగస్టు 2018): ఒక ఈమెయిల్‌లో, ఎప్స్టీన్ “డొనాల్డ్ ఎంత మురికి వాడో నాకు తెలుసు” అన్నాడు. న్యాయవాదులు కాని న్యూయార్క్ వ్యాపారవేత్తలకు  “have no idea. what it means to have your fixer flip”. (“మీ ఫిక్సర్ ఫిలిప్ అయితే ఏమి జరుగుతుందో తెలియదు”) అని ఊహించాడు.
  • “దాదాపు పిచ్చివాడు” (2018): లారెన్స్ హెచ్. సమ్మర్స్‌తో సంభాషణలో, ఎప్స్టీన్ “trump – borderline insane” “ట్రంప్ – దాదాపు పిచ్చివాడు” అని రాశాడు.
  • దగ్గరగా ఉంటే దారుణం (2017): మాజీ వైట్‌హౌస్ కౌన్సిల్ కాథీ రూమ్లర్, ట్రంప్ “so gross,” “చాలా అసహ్యంగా” ఉంటారని రాసిన దానికి ఎప్స్టీన్ ఏకీభవిస్తూ,”worse in real life and upclose” “దగ్గరగా, నిజ జీవితంలో ఇంకా దారుణం” అని బదులిచ్చాడు. [Worse Up Close (2017): Epstein concurred with a note from former White House Counsel Kathy Ruemmler that Trump was “so gross,” replying, “worse in real life and upclose“.]
  • నమ్మదగని/దూరపు వ్యక్తి (మార్చి 2018): సుల్తాన్ బిన్ సులేయెమ్ అడిగిన ప్రశ్నకు, ఎప్స్టీన్ “డొనాల్డ్ ఎవరికీ సన్నిహితుడు  కాదు. అతను చాలా మందితో మాట్లాడతాడు. ఒక్కొక్కరికి ఒక్కో విషయం చెబుతాడు” అని బదులిచ్చాడు. [Untrustworthy/Distant (March 2018): When asked by Sultan Bin Sulayem if someone was close to Trump, Epstein replied, “donald is close to no one. he talks to many people. he tells each one something differnt”.]
  • జెఫ్రీ ఎప్స్టీన్, 2017 మే చివరిలో ట్రంప్ గురించి ఈ విధంగా అన్నాడు: “మీ ప్రపంచానికి అతను నిజంగా ఎంత మూర్ఖుడో అర్థం కాదు. చెడు ఫలితాలకు అతను తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ నిందిస్తాడు.”

II. మైఖేల్ వోల్ఫ్ తో రాజకీయ, మీడియా వ్యూహాల చర్చ

ఎప్స్టీన్, తనపై మీడియా దృష్టి మళ్ళినప్పుడు, ట్రంప్‌తో తనకున్న సంబంధాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై రచయిత మైఖేల్ వోల్ఫ్ నుండి సలహా తీసుకున్నట్లు ఈమెయిల్స్ ద్వారా తెలిసింది:

  • రాజకీయ లబ్ధి (డిసెంబర్ 2015): ట్రంప్‌ను అడిగే మీడియా ప్రశ్నల గురించి వోల్ఫ్ హెచ్చరించినప్పుడు, ఎప్స్టీన్ “ఆయనకి ఒక సమాధానం తయారు చేయగలమా?” అని అడిగాడు. వోల్ఫ్, ట్రంప్ తమ సంబంధాన్ని కాదంటే, అది ఎప్స్టీన్‌కి “విలువైన పీఆర్, రాజకీయ కరెన్సీ” ఇస్తుందని, దానిని ఉపయోగించి తర్వాత అతన్ని “ఇరికించడానికి” లేదా “ఋణం సృష్టించి రక్షించడానికి” వీలవుతుందని సలహా ఇచ్చాడు. Political Leverage (December 2015): When alerted to potential media questions about him and Trump, Epstein asked Wolff if they could “craft an answer for him”. Wolff suggested letting Trump “hang himself” by denying their association. This denial, Wolff noted, would give Epstein “valuable P.R. and political currency” that could be used to either “hang him” later or “save him, generating a debt“.
  • ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం (మార్చి 2016): వోల్ఫ్, ఎప్స్టీన్ తన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి “ట్రంప్‌కు వ్యతిరేకంగా” మాట్లాడాలని సలహా ఇచ్చాడు. “ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా మారడం వలన మీకు ఇప్పుడసలు లేని రాజకీయ కవరేజ్ లభిస్తుంది” అని వోల్ఫ్ రాశాడు. ట్రంప్‌ను “అంతం చేయడానికి సహాయపడే” విధంగా మాట్లాడాలని కూడా సూచించాడు. 
  • Jeffrey Epstein to Michael Wolff in convo about Trump: “I am meticulous about documentation and back up”
  • డొనాల్డ్ ట్రంప్ గురించి జెఫ్రీ ఎప్‌స్టీన్: “అతను ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాడు మరియు పిచ్చివాడు!!! నేను మొదటి రోజు నుంచీ అందరికీ చెప్పాను. నమ్మశక్యం కాని దుర్మార్గుడు. పిచ్చివాడు, మరియు చాలా మంది నేను అలంకారికంగా మాట్లాడుతున్నానని అనుకున్నారు. అతను విరిగిపోవడం స్పష్టం. స్టార్మీ డేనియల్స్? అబద్ధాల తర్వాత అబద్ధాలు తర్వాత అబద్ధాలు.”

III. రాజకీయ పరిణామాలు, వైట్‌హౌస్ ప్రతిస్పందనలు, ఎప్స్టీన్ నిఘా

ఈ విడుదల వెంటనే రాజకీయ ప్రకంపనలు సృష్టించింది, అలాగే ఎప్స్టీన్ రాజకీయాలపై ఎంత ఆసక్తి చూపారో కూడా వెల్లడించింది:

  • వైట్‌హౌస్ ఖండన: ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, ఈ ఈమెయిల్స్ “ట్రంప్ ఏ తప్పు చేయలేదనే విషయాన్ని తప్ప మరేమీ నిరూపించవు” అని తోసిపుచ్చారు. పేరులేని బాధితురాలు వర్జీనియా గిఫ్రే అని రిపబ్లికన్‌లు గుర్తించారు. గిఫ్రే గతంలో “ట్రంప్ ఏ విషయంలోనూ పాల్గొన్నారని నేను అనుకోను” అని చెప్పిన వాంగ్మూలాన్ని వైట్‌హౌస్ ఉదహరించింది.
  • ట్రంప్ క్లబ్ నుండి పంపేయడం: “ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ట్రంప్ ఎప్స్టీన్‌ను దశాబ్దాల క్రితమే తన క్లబ్ నుండి పంపేశాడు” అని వైట్‌హౌస్ చెప్పగా, ఎప్స్టీన్ ఈమెయిల్‌లో “నేనెప్పుడూ మెంబర్‌నే కాదు” అని దానిని ఖండించాడు.
  • అకోస్టాపై నిఘా (2017): ఎప్స్టీన్, తన తేలికపాటి శిక్ష ఒప్పందాన్ని పర్యవేక్షించిన మాజీ U.S. అటార్నీ అలెగ్జాండర్ అకోస్టా లేబర్ సెక్రటరీగా నియమితులైనప్పుడు, తన లాయర్‌ని “విచారణల్లో అకోస్టా తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు” అని అడిగాడు.
  • ఆర్థిక పరిశీలన (2019): ఎప్స్టీన్ సలహాదారుల్లో ఒకరైన రిచర్డ్ కాన్, ట్రంప్ ఫెడరల్ ఫైనాన్షియల్ డిస్‌క్లోజర్ ఫామ్‌ను విమర్శిస్తూ, “100 పేజీల అర్థం లేని విషయం” అని పేర్కొని, ట్రంప్ రుణాలు, ఆదాయంపై ముఖ్యమైన తొమ్మిది అంశాలను ఎప్స్టీన్‌కు పంపాడు. Financial Scrutiny (2019): An adviser, Richard Kahn, sent Epstein a detailed, critical analysis of Trump’s federal financial disclosure form, listing nine findings about his loans, income, and foundation, and calling the report “100 pages of nonsense“.
  • రష్యాకు సలహా (2018): ట్రంప్‌ను అర్థం చేసుకోవడానికి రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్ “నాతో మాట్లాడితే సమాచారం తెలుసుకోవచ్చు” అని పుతిన్‌కు సూచించమని యూరోపియన్ అధికారి థోర్బ్జోర్న్ జగ్లాండ్‌కు ఎప్స్టీన్ సలహా ఇచ్చాడు. Insight for Russia (2018): Epstein suggested to European official Thorbjorn Jagland that he recommend to Putin that Lavrov “can get insight on talking to me” to understand Trump.

IV. కాంగ్రెస్ చర్యలు, ట్రంప్ ఒత్తిడి

విడుదలైన ఈమెయిల్స్, ఎప్స్టీన్ ఫైల్స్‌ను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేసే ప్రయత్నాలను తీవ్రతరం చేశాయి, దీనికి అత్యున్నత రాజకీయ ఒత్తిడి తోడైంది:

  • ఓటుకు గ్యారెంటీ: ఫైల్స్ విడుదల చేయాలని కోరుతూ బైపాజిస్టిక్ తీర్మానం (డిస్‌చార్జ్ పిటిషన్)పై ఓటు వేయడానికి అవసరమైన చివరి సంతకాన్ని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతినిధి అడెలిటా గ్రిజాల్వా (డెమొక్రాట్) అందించారు.
    • స్పీకర్ మైక్ జాన్సన్, ఈ చర్యను వ్యతిరేకించినప్పటికీ, వచ్చే వారం ఓటుకు పెడతామని చెప్పారు.
    • ఈ ఓటు ఏడు శాసన రోజుల తర్వాత, అంటే డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
  • రిపబ్లికన్లపై ట్రంప్ ఒత్తిడి: ట్రంప్ పరిపాలన, ఫైల్స్ విడుదల చేయాలని సంతకం చేసిన రిపబ్లికన్లపై ఒత్తిడిని పెంచింది.
    • అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రతినిధి లారెన్ బోబెర్ట్ (రిపబ్లికన్)ను వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌కి పిలిపించి ఈ విషయంపై చర్చించారు.

ట్రంప్ స్వయంగా ప్రతినిధి నాన్సీ మేస్ (రిపబ్లికన్)కు ఫోన్ చేసి తన సంతకాన్ని తీసివేయమని కోరగా, ఆమె నిరాకరించింది. మేస్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, “ఎప్స్టీన్ బాధితులతో నా హృదయం, నా బాధ ఉంది” అని చెప్పింది, అయితే ట్రంప్ లైంగిక వేధింపుల బాధితులకు “చాలా మంచి” చేశారని కూడా పేర్కొంది.