Some Views on T-movement
గిరిజనుల కోసం పోరాటం చేసినందుకు బినాయక్ సేన్ మీద రాజద్రోహం కేసు పెట్టారు, సరే బినాయక్ సేన్ మావొఇస్టుల సానుభూతిపరుడే అనుకుందాం.
మరి ఆంధ్రాలో జరిగేదేంటి? ప్రభుత్వోద్యోగం చేస్తూ, నెల నెలా ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ప్రభుత్వం మీద తిరగుబాటు చేస్తాం, ప్రభుత్వాన్ని పని చేయనివ్వమని కారు కూతలు కూసే కోదండరాం స్వామి గౌడ్ లాంటి వాళ్ళ మీద ఎలాంటి రాజ ద్రోహం కేసులు పెట్టాలి? వీళ్ళంతా చదువు జ్ఞానం లేకుండానే ప్రభుత్వోద్యోగం చేస్తున్నారా? ప్రజల మేలు కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తానని దేవుడి మీద ప్రమాణం చేసిన మంత్రులు, దేశ అభ్యున్నతి కోసం పని చేస్తామని ప్రమాణం చేసిన పార్లమెంట్ సభ్యులు, ఒక పక్క దేశం ముంబై తీవ్రవాద దాడుల్లో అల్లకల్లోలం గా ఉంటే వేదికలెక్కి డాన్సులు చేస్తారా? బుద్ది జ్ఞానం ఉందా వీళ్ళకు?
ఈరోజు కోదండరాం ఇంకొక నినాదం అందుకున్నాడు, 26న ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు తీసేసి అన్ని చోట్ల తెలంగాణా అని రాస్తాడట. కోదండరాం కి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఇచ్చే జీతం తీసుకోవద్దు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం వదిలేసి పూర్తి కాలం రాజకీయనాయకుడి వేషం వేస్తే కోదండరాం చేసే కోతి పనులన్నింటికి ఒక అర్థం ఉంటుంది.
విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని ఉద్యోగం ఇస్తే ఆ పని ఏనాడైనా సక్రమంగా చేసాడో లేదో కానీ విద్వేషాలు రగల్చడం విధ్వంసాలకి పధక రచన చేయడం లో మాత్రం నిజంగానే ప్రొఫెసర్ అనిపించుకున్నాడు మన కోదండరాముడు.
తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకుడినని చెప్పుకొని ఒక పది మందిని వెంటేసుకొని హడావుడి చేస్తుంటాడు స్వామి గౌడ్. ఈయన గారు చేసేది ఏమి ఉద్యోగమో ఆయన ఉద్యోగం ఎక్కడో కూడా ఎవరికీ తెలీదు. అయిన ఈయనకి బోలెడంత క్రేజ్ పబ్లిసిటీ మన మీడియాలో.
రాజకీయ కారణాలతో సమ్మె నోటీసు ఇచ్చినందుకు సమ్మెలో పాల్గొన్న అందరిని సస్పెండ్ చేసి పడేస్తే దెబ్బకి దెయ్యం దిగోస్తుంది..నా అత్యాశ కానీ అలా చేయడానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జయలలిత కాదు కదా. ఒక్క కలం పోటుతో ఇరవయ్ లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన జయలలిత లాంటి డైనమిక్ ముఖ్యమంత్రి అవసరం మన రాష్ట్రానికి చాలా ఉంది.
ఇక ఉస్మానియా జాక్. అల్లం నారాయణ, బల్క సుమన్ లాంటి ముదురు మొహాల వాళ్ళు ఉస్మానియా విద్యార్ధి నాయకులు. వీళ్ళు అయితే చదువులు అబ్బకుండా కాంపస్లో రోజులు గడిపేస్తూ ఉండాలి లేకపోతె వీళ్ళ చదువులు చూసి ఎవడు ఉద్యోగం ఇవ్వకపోతే గబ్బిలాయిల్లగా కాంపస్ పట్టుకొని వేలాడుతూ ఉంది ఉండాలి. అందుకే తెలంగాణా వచ్చేస్తే బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టి ఉస్మానియాలో విద్యార్దులని రెచ్చగొట్టి ఉస్మానియా ని ఒక రణక్షేత్రంగా మార్చేసారు.