సత్సందేశాలు అనేకం – చాలావరకు అన్ని మనకు తెలిసినవే.
అందుకే వినేందుకు ఉత్సాహం చూపించం.
ఎవరు వింటారీ ఉపన్యాసాలు అనిపించేలా చెప్తారు కొందరు
భలే చెప్పారు ఈయన అనిపించేలా కొందరు చెప్తారు.
సందేశం ఏమిటన్నది కాదు,
ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనేవి సరైన ప్రశ్నలు.
సందేశం ఇచ్చినవారు ప్రముఖ కవి, సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. మరియు, పద్మభూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డి.
జొన్నవిత్తుల గారి ప్రసంగాలు మోహన మురళీ గానలహరిలో భాగంగా ప్రసారం అవుతాయి.
ఆ పైన వరప్రసాద రెడ్డి గారు “మంచి మాట, పసందైన పాట” తనదైన బాణి లో నిర్వహిస్తారు. ఆయన సమర్పించిన పాటలు కొన్ని మీరు ఎప్పుడూ విని ఉండరు. అందుకంటే, అవి ఆయనే స్వయంగా రికార్డు చేయించినవి.
ఎలా చెప్పారు అంటారా? స్పష్టంగా, ఆకట్టుకొనేలా, ఆహ్లాదపరిచేలా, పదికాలాలు గుర్తుంచుకొనేలా…
మీరడగవచ్చు – తెలుగా, ఇప్పుడా? ఎందుకట?
యేను తెలుగు పుత్రుండ.
వాహికా? అదేమిటి?
వినుడి – వినుడి.