ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం…సాటి భారతియులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!!!
64 సంవత్సరాల స్వతంత్ర భారతం లో ఇంతకుమున్దేప్పుడు లేని నాయకత్వ కొరతని ఇప్పుడు మనం చూస్తున్నాం. రాత్రి CNN-IBN ఛానల్ లో ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం లైవ్ చూసాను. 20 నిమిషాల సింగ్ గారి ప్రసంగం లో 20 సార్లు నెహ్రు జీని, ఇందిరా జీని, రాజీవ్ జీని, సోనియా జీని పొగడడానికే ఆయనకి సగం సమయం పట్టింది. ఒక దేశ ప్రధానికి ఒక కుటుంబాన్ని పొగడవలసిన అన్ని సార్లు అవసరం ఏముంది? మాజీ ప్రధానుల్లో నెహ్రు, ఇందిరా, రాజీవ్ కన్నా చెప్పుకోదగ్గ వాళ్ళెవరు లేరా? ఈ దేశానికీ నెహ్రు కుటుంబం కంటే వేరే నాయకులూ లేరా? ఒక ఇటాలియన్ మహిళా ముందు మన దేశ రాజకీయ నాయకత్వం మోకరిల్లవలసిన్దేనా? రాజీవ్ ఒక ఇటలియన్ ని తెచ్చి పెట్టి పోయాడు రేపు ఆయన కొడుకు రాహుల్ ఒక ఫ్రెంచ్ వనితనో ఇంకెవరినో నా భార్య అని తెచ్చి మన దేశం మీద రుద్దుతాడు. అప్పుడు కూడా ఈ వందిమాగధులు వాళ్ళకి జేజేలు పలుకుతారా?
ఇక రాష్ట్రం విషయానికొస్తే అస్సలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అనే అనుమానం!!! ముఖ్యమంత్రి తనంతతాను ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రతి చిన్న విషయానికి అధిష్టానందే నిర్ణయం. ఇక్కడా పరతత్వమే. తెలంగాణా ఇవ్వాలన్నా, వద్దన్నా, రైతులకు అప్పులు ఎరువులు ఇవ్వాలన్నా, పొరుగు రాష్ట్రం తో జలవివాదాలలో పోరాదలన్నా కాడి వదిలేయలన్నా మన రాష్ట్ర నేతలకు ఆ అధికారం లేదు. ముఖ్యమంత్రి పదవి రాలేదని ఒకరు, రాష్ట్ర విభజన జరగలేదని ఒకరు, మంత్రి పదవి దొరకలేదని ఒకరు ఇలా ప్రతి ఒక్కరు అసాంఘిక శక్తులుగా తయారయ్యారు.
వీటన్నిటిలోకి అత్యంత దారుణమైనది విద్యార్ధుల ఆత్మహత్యలు. యీ ఆత్మహత్యలకి మూలకారణం కెసిఆర్, అతని మేనల్లుడు హరీష్ రావు. “తెలంగాణా తెచుడో KCR చచ్చుడో” అన్న నినాదం తో విద్యార్ధి లోకాన్ని రెచ్చగొడితే నిరాహారదీక్ష లో ఉన్న కెసిఆర్ ని అర్రెస్ట్ చేస్తే ఆత్మాహుతి చేసుకుంటానని హరీష్ రావు ఒక పెద్ద డ్రామా కి తెరలేపాడు కిరోసిన్ సీసా చేతిలో పట్టుకొని. ఈ కెసిఆర్ కి కానీ హరీష్ రావు కి కానీ చిన్న గాయం కూడా కాలేదు యీ నాటకాలతో కానీ ఎంతో విద్యార్ధులు ఆత్మహత్యలకి పాల్పడ్డారు. ఇక విద్యార్ధుల విషయానికొస్తే వాళ్ళేమి లోకం తెలియని అమాయకులు కాదు. ఉప ఎన్నికలరోజున తగలపెట్టుకొన్న ఇషాన్ రెడ్డి GRE/TOEFL పరిక్షలు రాసాడట ఇంజనీరింగ్ చదివాడట. ఇదేనా అతను చదివిన చదువు? అన్ని బాగుంటే యీ అపరిపక్వ ఇంజనీర్ అమెరికా లో MS చేసి ఏదో ఒక పెద్ద కంపెనీ లో ఉద్యోగం వెలగబెట్టేవాడు. తన తెలివితక్కువ తనం తో ప్రాణాలు తీసుకొన్నాడు ఇప్పుడు ఎవడికి బాధ? వాడి తల్లి తండ్రులని చూసేదేవడు? చదువుకొని ఉద్దరిస్తాదనుకుంటే పిచ్చి ఉన్మాదం తో ప్రాణాలు తీసుకున్నాడు. ఎవరికోసమైతే వీళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారో ఆ నాయకులు అంత గొప్ప నాయకులైతే ఒక్క నాయకుడు కూడా గాంధి లాగానో, పొట్టి శ్రీరాములు లాగానో ఒక సమస్య మీద శాంతియుతం గా ఆందోళన చేయరేమరి? సామాన్యులని రెచ్చగొట్టి తమ స్వార్ధం కోసం వాళ్ళ ప్రాణాలు ఎందుకు బలి పెడతారు? తమ కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వాళ్ళేమి సహాయం చేయరు…కానీ ప్రభుత్వం వీళ్ళ కోసం పోయినవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, భూమి ఇవ్వాలి ఇంకా వాళ్ళ కుటుంబం లో ఒకడికి ఉద్యోగం కూడా ఇవ్వాలి. దేశ రక్షణ లో చనిపోయిన సైనికుల వీళ్ళు? ముందు వెనక ఆలోచించకుండా కుటుంబ పరిస్థితులని గుర్తించకుండా ఎవడో రాజకీయ నాయకుడి కోసం ఆత్మహత్య చేసుకున్నవాళ్ళ కుటుంబాలని ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి? నాయకులూ వాళ్ళ కుటుంబాలు బాగుండాలి కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళు చావాలి. ఇలా ఆత్మహత్యలకి ప్రేరేపించే నాయకులని, ప్రోఫెస్సర్స్ ని హత్యా నేరం కింద అర్రెస్ట్ చేసి శిక్షిస్తే కానీ యీ ఆత్మహత్యలు ఆగవు. కానీ మనదేశంలో అలాంటివి ఆశపడడమే కానీ జరగవు కదా. ఈ రోజుల్లో ఫలానా నాయకుడి కోసం ఎంత మంది చస్తే ఆయా నాయకులకి అంత పేరు.
ఇంత మంది ఆత్మహత్య లకి కారణమైన కెసిఆర్ మీద ఈగ కూడా వాలనివ్వదు మన చేతకాని చేవలేని ప్రభుత్వం. పైగా ఉప ఎన్నికల్లో గెలిచేసమని పండగలు. గెలిచినందుకు కెసిఆర్ కి ప్రతిష్ట, అతని పార్టీకి లాభం మరి ప్రజల కేంటి లాభం? ఇలాంటి అనవసరపు ఉప ఎన్నికలు రాకుండా పదవి లో ఉన్నవాడు చీటికిమాటికి రాజీనామా చేస్తే క్రితం ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్నవాడికి ఆ పదవి దక్కేలా రాజ్యాంగ సవరణ చెయ్యాలి లేదా రాజీనామా చేసినవాడితోనే ఉప ఎన్నికల ఖర్చు, మిగతా పార్టీల ప్రచారం ఖర్చు రాబట్టాలి.
ప్రజల లో నుంచి పుట్టి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేసే నాయకులు వచ్చినప్పుడే మన దేశానికీ నిజమైన స్వతంత్రం. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటూ మరోసారి అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!!!
I agree 100% with you…….Hopefully this politics will change. I don’t think that change will start with these politicians, that change should start with us , with every individual patlrticipation in our country… The great one and only India…..
Great post, Arun garu !
too many questions here. 🙂
Arun,
Excellent rant! I agree with you on almost everything you said. I have just one issue with your post: there is no need for a doctored photographic image of Iwo Jima symbol with Indian flag. India has her own pride symbols of freedom. Example: Dandi March.