GATLANE UNTADI

న్యూస్ హెడ్ లైన్స్
తెలంగాణా ఉద్యమం లో భాగంగా జరిగిన అల్లర్లలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం.

సీన్ – 1
వరంగల్ పట్టణం, పోచమ్మ మైదాన్ ప్రాంతం.

శీను: హలో, అరేయ్ కాకా ఏడున్నావ్ రా?
బాలు: కాకా నేను చౌరస్తా లో ఉన్నా…

శీను: సూసినవ, మన దుకాణం కాలబెట్టిన పోరనిమీద పెట్టిన కేసు ఎత్తేసిన్రు.
బాలు: నేను గప్పుడే సెప్పినగద బే… గీ కేసులన్నీఉండేది లేదు సచ్చేది లేదని.

శీను: గదేందిరా బై?? దుకాణాలు కాలబెట్టి బస్సులల్ల అద్దాలు పగలగొడితే ఏం చెయ్యర? ఉద్దెమం అంటే గిదేనా? అసలు గవర్నమెంటు ఏం చేత్తుంది? గీసంది ఇట్టాగే ఊరకుంటే ఎమన్నా సేత్తరు ఈ పొరలు.
బాలు: లైట్ తీసుకోర బై. గా సాలె గాడు ఏడ పోతడు? మళ్ళ దొరకడా? గప్పుడు గాని నెత్తి పగలగోట్టాలే ఉద్దెమం అని చెప్పాలె.!!

సీన్ – 2
అదే వరంగల్, రామన్నపేట.
కుమార్: ఏమిరా నర్సిగా కేసు ఎత్తేసిన్రంటగద పార్టీ లేదా?
నర్సి: లేదురా బై… ఆ శీనుగానిమీద ఎప్పటిసందో నాకు కోపం ఉండే… వాని షాప్ కాలబెట్టిన గాని వాని కార్ డామేజ్ చెయ్యలేకపోయిన. మళ్ళ ఎమన్నా లొల్లి గావాలె, సాలేగాని కారు కొంప రెండింటిని కాలబెట్టాలి
కుమార్: అబేయ్ హౌలే, గిప్పుడంటే గవర్నమెంటు కేసులు ఎత్తేసింది. మళ్ళ గా గలీజు పని చెయ్యకపోతే ఏం? మళ్ళ కేసులు ఎత్తేయ్యకపోతే?
నర్సి: ఎందుకు చెయ్యది? మన లీడెర్స్ ఉన్నారే.. గవాళ్ళకి మన వోట్లు కావాలె. మామూలు జనం ఎట్టాగూ వోటు వెయ్యరు. మరి మనలాంటివాళ్ళతోనే కదా వాళ్ళకి అవసరం!!
కుమార్: మనకెందుకురా గివన్ని? మనం సదువుకోనికి ఊర్లకేల్లి వచ్చినం. మన పనేదో చూసుకోవాలె, మంచి నౌకరి చూసుకొని పోవాలె.
నర్సి: ఎవడుబే సదువుకునేది? నేను రెండు పీ.జీ. కోర్సులు చేసిన. ఎమన్నా కొలువు వచ్చిందా? మన నౌకరిలన్నిఆ ఆంధ్రా వాళ్ళు కొట్టుకపోతుంటే మనమేమో చూస్తూ ఉన్నాం. గివన్ని పనిచేయ్యవని నేను MPhil కట్టిన. కాంపస్ లో ఫుడ్, రూం, ఇది కాక నెలకు స్టైఫండు. గివన్ని ఫ్రీ కదా. పార్టీల ఫండు ఈల్దగూ వత్తది. నువ్విత్తవ గివన్ని?
కుమార్: కాకా ఏమనుకోకు ఒక్క మాట చెప్తా. గీ పార్టీలన్నీ గిప్పుడు నిన్ను వాడుకున్టై. పనైపోతే నిన్ను పట్టించుకోవు. నీ లైఫ్ ఖరాబ్ అవుతదిర.
నర్సి: పో బే నువ్వు చెప్పెదేంది నాకు?

సీన్ – ౩:
హైదరాబాద్, పార్టీ ఆఫీసు
చోటా లీడర్: అన్నా, పొరల్లమీదబెట్టిన కేసులు ఎత్తేసిన్రుకదా, మరి గా పొరల్లకి నెక్స్ట్ ప్లాన్ ఏందో చెప్పరాదే!
బడా లీడర్: ఔతమ్మి నువ్వైతే ముందుగాల పొయ్యి క్యాంపస్ లో ఉన్నా మన పొరల్లకి మందుకి బిరియానికి పైసల్ ఇచ్చిరా.. మీ తమ్మునికి ఫోన్చేసి వరంగల్ లో కూడా పైసల్ పంచమని చెప్పు. తర్వాత ఐకాసని ఒకపరి నన్ను కలవమను.
చోటా లీడర్: అన్నా, మనం ఊర్కేనే గా పొరల్లకు ఎక్కువ సీన్ ఇత్తున్నమన్నా
బడా లీడర్: తమ్మి, మనం గాళ్ళని యూజ్ అండ్ త్రో లెక్క వాడుకుంటున్నాం. మన కాడర్ తో కూడా చేయించచ్చు. కాని గిసుమంటి చిల్లరపనులకి కాడర్ లాస్ కావద్దు. ఈ కొడుకులది ఏముంది పైసల్ బిర్యాని పడేస్తే ఎమన్నా చేత్తరు. ఎమన్నా అయితే వాళ్లేగా పోయేది. మంచి అయితే మనం క్రెడిట్ తీసుకోవచ్చు.
చోటా లీడర్: మరి వాళ్ళలో ఎవనికన్న డౌటు వత్తే?
బడా లీడర్: ఏముంది బై గవాడు ఉద్యమద్రోహి అని వాని దోస్తులతోనే కొట్టిద్దాం
చోటా లీడర్: అన్నా నీ బుర్రే బుర్రన్నా. సూపర్.

ఉద్యమాల ముసుగులో విధ్వంసాలు చేసే రౌడీలు (క్షమించాలి వాళ్ళను స్టూడెంట్స్ అని అనలేం) ఉన్నంత కాలం ఇలాంటి దృశ్యాలు మనం చూడక తప్పదు.
రాబోయే కొత్త సంవత్సరంలోనైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తూ…
– వరుణ్ పారుపల్లి (నేను తెలంగాణా వాదినే. కాని వేర్పాటువాధిని కాదు)

About the Author

vparupal
Hi People, this is Varun from Los Angeles. I am working as an IT professional... born and brought up in Madhira, Khammam Dist. I did my masters in Kakatiya University, Warangal. Happily married to Haritha and blessed with sweet Nisanth. My hobbies are playing cricket (these days online only) and writing stories. I am here to contribute my stories to the content of this website. Hope you will like it :)

4 Comments on "GATLANE UNTADI"

  1. Political Vaccum, being filled up. There are many purposes..but they choose a (not so necessary)purpose, which can get them immediate attention. People vandalism is easy to achieve by playing with emotions. All the students are now emotionally attached to the so called purpose. I got another doubt., I also suspect a suicide scandal going on along with the movement. How come students, who could get a seat in University colleges(supposed to be best among the lot,) commit suicide. I dont think they are such low on morale. Even if they want to die for the cause, they could go on Satyagraha, the legal way to protest. These people killing students in the disguise of suicides, what they want is immediate media attention, so, they find ways to psychologically influencing people to kill themselves for a cause.(ISn’t this a murder.. conspiring to kill themselves).. I’m in serious worry for these student murders, for a political cause, not even a social cause.

  2. @KCR, medakai meeda talakai unnodu evadikaina idi arthamaithadi

    @sharu8123, did you ever see the atmosphere in KU campus or OU campus? you better see it. I studied for 3 years in KU and I know what’s going on there. I did not say all activists are rowdies. as i mentioned SOME are really rowdies. And coming to Telangana culture, it’s no alien to me. I was born and brought up here.

  3. Don’t mix your fiction with reality. These kind of degrading actions making about fun about telangana culture always prompts for a separate telangana. You are a psuedo telanganite.

  4. Neekanna ardhmainda raa bi

Comments are closed.