Meet Late Sri Venigalla Purnachandra Rao

Fathers Day సందర్భంగా, నా ఉనికికి, అభ్యున్నతికి కారణమైన తల్లిదండ్రులను గుర్తుచేసుకుందామని  కాదు ఈ  వ్యాసం..  అమ్మను, నాన్నగారిని గుర్తుచేసుకునేందుకు ప్రత్యక మైన దినాలు అఖ్ఖర్లేదు నాకు.. మరచిపోని, మరచిపోలేని మనుషులను గుర్తు చేసేందుకు ప్రత్యేక దినాలు ఎందుకట?  కాని, ఈ  Fathers Day సందర్భంగా నాన్నగారిని మీకు పరిచయం చేస్తున్నాను.

Geethaakavisekhara Venigalla Purnachandra Rao

“గీతా కవిశేఖర” వెనిగళ్ళ పూర్ణచంద్ర రావు
జననము: 18-08-1935
మరణము: 18-07-1982
తల్లిదండ్రులు: వెనిగళ్ళ తులసమ్మ, వెనిగళ్ళ నారాయణ
జన్మభూమి: దోనేపూడి, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
విద్యాభ్యాసము:

  • SSLC –  స్థానికోన్నత పాఠశాల (ZP High School), దోనేపూడి (1952 )
  • BA (English Literature) – స్వయంకృషి (1961)

వృత్తిలో ప్రవేశము: 22-08-1952, Lower Division Clerk (LDC), స్థానికోన్నత పాఠశాల, కొల్లూరు
చివరి వృత్తి: Block Development Officer, (BDO) మాచర్ల పంచాయతి సమితి
రచనలు:

  • మధురస్వప్నము (పద్య కావ్యము) – 1973
  • గీతా చంద్రిక (శ్రీమద్ భగవద్గీతాంధ్ర పద్యానువాదము) – 1974

సన్మానములు: నెల్లూరు, రేపల్లె, పెదపులివర్రు, వెనిగళ్ళవారి పాలెం మున్నగు చోట్ల
అర్ధాంగి లక్ష్మి: ధనలక్ష్మి
సంతతి: వెంకటరమణ, మోహన మురళీధర్, జ్యోత్స్న
కోడళ్ళు: సత్యశ్రీ, శిరీష
అల్లుడు: నూతక్కి వెంకటరత్నం
మనవరాళ్ళు, మనుమలు: ధనలక్ష్మి, చంద్రదీప్తి, మృదుల, కీర్తి, ఈశ్వర్, చంద్రకాంత్
స్వగృహము: 6 వ వార్డు, రేపల్లె, గుంటూరు జిల్లా

Late Sri Venigalla Purnachandra Rao, late Smt. Venigalla Dhana Lakshmi

సీరియస్ గా అనిపిస్తున్న ఆయన ముఖం వెనక వున్న మేధ సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఆయనను తెలిసినవారు అంటుంటారు – మహా మేధావి అని. ఆయనకు తొమ్మిదేళ్ళ వయసులో పోలియోతో ఒకటిన్నర కాళ్ళు చచ్చుబడిపోయాయి. తాత, నాయనమ్మలు SSLC తర్వాత చదువుకు ప్రోత్సహించలేదు. అవిటితనం ఆయన పట్టుదలను, దీక్షను సడలించలేదు. 1961 లో స్వయంకృషి తో BA English literature పూర్తి చేయగలిగారు (అవును, అప్పట్లో అది సామాన్యమైన విషయం కాదు) 36 సంవత్సరాల వయసులో మధుర స్వప్నం, 38 సంవత్సరాల వయసులో గీతానువాదం పూర్తి చేసారు. నాన్నగారు రచించిన గ్రంధాలు వెలుగుకు నోచుకోలేదు. ఆయన రచనలు వెలుగులోకి తీసుకురావడం తనయుడిగా నా విద్యుద్ధర్మంగా భావిస్తున్నాను. అందుకే త్వరలోనే నాన్నగారి శ్రీమద్ భగవద్గీతాంధ్ర పద్యానువాదం – గీతాచంద్రిక ను ఈ  వేదిక ద్వారా మీకు పరిచయం చేస్తాను.

Happy Fathers Day

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

4 Comments on "Meet Late Sri Venigalla Purnachandra Rao"

  1. Very inspirational. Thanks for sharing.

    –Ramana

  2. Good luck, Murali!

    Also, mee nanna gaarini chaala maryaadapoorvakangaa introduce chesaaru. Chaalaa baavundi.

  3. Good luck Mohan garu.

  4. Bhanu Prakash | June 17, 2011 at 10:05 AM |

    Good luck on the Geeta Chandrika. It will be the best gift you can give it to your father.

Comments are closed.