Pages Menu
Categories Menu

Posted by on Feb 6, 2011 in Arts, History, Literature, Movies, Songs, Telugu, TG Roundup

తెలుగు సినీ గేయ కవుల చరిత్ర – పుస్తక పరిచయం

తెలుగు సినీ గేయ కవుల చరిత్ర – పుస్తక పరిచయం

సినిమా పాట ప్రాచుర్యం గురించి, నిత్య జీవితంలో దాని ప్రభావం గురించి, ఒక పాట మనకు కలుగజేసే అనుభూతి గురించి, నేను చెప్పవలసిన పనిలేదు. ఇది ప్రతివారి నిత్యజీవితంలో చోటుచేసుకున్నది.

మహాకవి శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో ‘పాటల్లేని సినిమా ఉప్పు లేని పప్పులాంటిదీ అని, పాట అంతర్లీనంగా పోషించే పాత్ర గురించి చెప్పారు.

సాధారణంగా మనం పాట పాడిన గాయకుడికో, గాయనీమణికో ఇచ్చినంత గుర్తింపు –
ఆ పాటను సృష్టించిన రచయితకు, మరియు
ఆ రచయిత భావానికి జీవంపోసే రాగాన్ని లయబద్దం చేసిన సంగీత దర్శకునికి ఇవ్వలేదేమోనని, అనిపిస్తుంది!

బహుశ అలాంటి అనుభూతులకు లోనైనవారు ఎందరో ఉండవచ్చు. కాని, ఆ అనుభూతికి పరిషోధన జతచేసి, తమ తోటి తరాలని, ముందటి తరాలని ప్రభావితం చేసిన, మరియు ముందుటి తరాల ఔన్నత్యము పెంచిన, మార్గదర్షకులైన సినీగేయ కవుల గురించి, డా|| పైడిపాల గారు ఒక చక్కటి పుస్తకాన్ని, ‘తెలుగు సినీగేయకవుల చరిత్రా పేరిట మన ముందుంచారు.

డా|| పైడిపాల గారు ఇదివరలో ఆత్రేయ నాటకాల పూర్వపరాల మీద, తెలుగు సినిమా పాట మీద విసౄత పరిశోధనలు చేసి, యం.ఫిల్. మరియు డాక్టరేటు డిగ్రీలు అందుకున్నారు. ఆత్రేయ రచనల సమగ్ర సంకలనంలో జగ్గయ్యతో పనిచేసి ఎంతో విలువైన సాహితీసంపద మనముందుంచారు. అయన ‘తెలుగు సినిమా పాటా మరియు ‘తెలుగు సినిమా పాట చరిత్రా అనే పుస్తకాలను తన పరిశోధనల ఆధారంగా ప్రచురించారు.

ఈ పుస్తకము యొక్క ఉద్దేశ్యం డా|| పైడిపాల గారి మాటలలోనే చెప్పాలంటే:
“ఎనిమిది దషాబ్దాల కాలంలో తెలుగు సినిమాపాటలో వచ్చిన ఎన్నో మార్పులకు ఇతర కారణాలతోపాటు దాని రూపషిల్పులైన కవుల పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆనవాళ్ళు చెరిగిపోతూ వక్రీకరణకు గురవుతున్న సినీకవులకు సంబంధించిన వాస్తవాలను సేకరించి ఆ చరిత్రను అక్షరబద్ధం చేస్తే- అది పర్తమానానికి భవిష్యత్తుకు బహుధా ఉపయోగపడుతుందని ఈ ప్రయత్నం.”

ఈ సినీగేయ కవుల చరిత్రలో 12 మందిని మార్గదర్షకులుగా గుర్తించారు. మరో 65 మంది కవుల గురించి క్లుప్తంగా రాయడం, మరికొందరిని పట్టిక వరకు పరిమితం చేయడం జరిగింది. కొందరి కొన్ని పాటల్లోని ఔన్నత్యం వెలికితీతతోపాటు, కొన్ని వివాదాలకు, విమర్షకులకు, అభియోగాలకు ఆస్కారమున్న అంషాలను చర్చించారు.

ఇది అన్ని విషయాలలో సమగ్ర రచన కాకపోయిన, ముందు ముందు సమగ్ర పరిషోధనకు దారి చూపే ఈ ప్రయత్నం బహుదా అభినందనీయం. ఎంతో ష్రమకోర్చి ఈ పరిషోధన సాగించి, తెలుగు సాహితీ సరస్వతికి తనవంతు సహాయాన్ని అందించిన డా|| పైడిపాల గారు అభినందనీయులు.

చివరగా ఈ పుస్తకంపై పద్మభూషణ్ యస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో అత్మీయతతో వ్రాసిని విశ్లేషణతో ముగిస్తూ, తెలుగు సాహిత్యం మీద, తెలుగు కవుల మీద, తెలుగు సినీమా మీద అభిమానమున్నవారు, తప్పక, కొని, చదవగలరని, మనమంతు కౄతజ్ఞత డా|| పైడిపాల గారికి తెలియచేస్తారని ఆషిస్తున్నాను:
“పదాలదేవిటి! షవాల్లా పడివుంటాయి, నా సంగీతవు చిరుజల్లు సంజీవనిలా వాటికి ప్రాణం పోస్తు”ందనే ‘అహంబ్రహ్మస్మీ గాళ్ళకి చెంపపెట్టు ఈ గ్రంధం. సినిమా ‘లో’ బతికే వారూ, సినిమాతో బతికే వారూ చదివి దాచుకోవలసిన, ‘ప్రయిజ్ కలెక్షన్.’

2 Comments

  1. Dear Satya garu,
    Thank you for pointing out about the font of Sri Sri. I realised the difficulties with transliterations in different packages.
    Further at times, it is really painful to seamlessly post or update.

    Regards… Saradhi.

  2. Dear Sir,

    Appreciated the posting.
    But, please help to correct the script. The name mentioned as reference was typed as Shri Shri, but it could be Sri Sri.

    Thanks,
    -Satya